రేపే అయోధ్య తుది తీర్పు.. దేశమంతటా ఉత్కంఠ

సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తీర్పు తర్వాత ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువమంది పోలీసులను మోహరించే ప్రయత్నం చేస్తున్నారు.

news18-telugu
Updated: November 8, 2019, 9:26 PM IST
రేపే అయోధ్య తుది తీర్పు.. దేశమంతటా ఉత్కంఠ
సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తీర్పు తర్వాత ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువమంది పోలీసులను మోహరించే ప్రయత్నం చేస్తున్నారు.
  • Share this:
కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య కేసులో సుప్రీంకోర్టు రేపు తీర్పు చెప్పనుంది. అయోధ్య రామజన్మభూమిపై శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది తీర్పును వెలువరించనున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫైజాబాద్ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తీర్పు తర్వాత ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసులను మోహరిస్తున్నారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం అర్ధరాత్రి పోలీస్ ఉన్నతాధికారులు,డివిజనల్ కమిషనర్స్,జిల్లా మెజిస్ట్రేట్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో భద్రతకు సంబంధించి అవసరమైన సలహాలుసూచనలు ఇచ్చారు. ప్రతీ జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తీర్పు తర్వాత ప్రశాంత వాతావరణం కొనసాగేలా చర్యలు ఉండాలన్నారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా చర్యల్లో భాగంగా యూపీ పోలీసులు రెండు హెలికాప్టర్లను కూడా సిద్దం చేశారు. ఇప్పటికే 20 తాత్కాళిక జైళ్లను కూడా ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే అరెస్టులకు అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు.


సుప్రీంకోర్టు కాపీ
First published: November 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading