మనలో చాలామంది పక్షి ప్రేమికులు ఉంటారు. పక్షులకు దాణా వేస్తుంటారు. ఇందులో అపార్ట్మెంట్లలో నివసించేవారు కూడా తమ ఫ్లాట్లలోని బాల్కనీల్లో పక్షులకు ఆహారం పెడతుంటారు. అయితే.. ఇలా చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. పక్షులు వేసే రెట్టల కారణంగా మిగిలినవారు ఇబ్బందులు పడుతున్నారని, పక్షులకు ఆహారం పెట్టాలనుకుంటే బహిరంగ ప్రదేశాల్లో పెట్టాలంటూ సూచించింది.
2011లో ఇదే విషయమై దిలీప్ సుమన్లాల్, మీనా నా షాలు కోర్టును ఆశ్రయించారు. తాము వర్లిలోని ఓ బిల్డింగ్‌లో ఉంటున్నామని, అక్కడే నివసించే జిగిషా ఠాకోర్ తన ఫ్లాటులో పక్షులకు గింజలు వేసి, నీరు పెట్టి బిల్డింగ్నంతా పక్షుల పార్క్‌లా మార్చారని, దీంతో అవి వేసే రెట్టలు, తీసుకొచ్చే చెత్త వల్ల ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని స్వీకరించిన ముంబై సిటీ సివిల్ కోర్టు 2013లో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు కింది కోర్టు ఆదేశాలను బలపరుస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National, National News, Supreme Court