Home /News /national /

SUPREME COURT TAKES SUO MOTU COGNISANCE OF LAKHIMPUR CASE CJI RAMANA LED BENCH TO HEAR MATTER ON THURSDAY MKS

CJI Ramana అనూహ్య నిర్ణయం -Lakhimpur హింసాకాండపై Supreme Court సుమోటో విచారణ -ఇంకొద్ది గంటల్లో..

లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు

లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు

Supreme Court takes Suo Moto over Lakhimpur Kheri's Violence incident : జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న ‘లఖీంపూర్ ఖేరిలో రైతులపై హత్యాకాండ’ కేసును సర్వోన్నత న్యాయం సుమోటోగా విచారణకు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వం సైతం మౌనాన్ని పాటిస్తోన్న సందర్భంలో సుప్రీంకోర్టు ప్రమేయం ఎటువైపునకు దారి తీస్తుందో ఇంకొద్ది గంటల్లో స్పష్టత రానుంది..

ఇంకా చదవండి ...
ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఈనె 3న చోటుచేసుకున్న హింసాకాండపై సుప్రీంకోర్టు జోక్యానికి సిద్ధమైంది. సదరు కేసులను సుమోటోగా విచారణకు స్వీకరించింది. గురువారం ఉదయం 11 గంటలకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం లఖీంపూర్ కేసుపై వాదనలు విననుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తోన్న రైతులను కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా కారుతో ఢీకొట్టి చంపడం, ఈ మేరకు అతనిపై హత్య కేసు కూడా నమోదు కావడం తెలిసిందే. నాటి ఘటనలో నలుగు రైతులతోపాటు ఒక స్థానిక జర్నలిస్టు, మరో నలుగురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు.

సాక్ష్యాత్తూ కేంద్ర మంత్రి కొడుకే కారుతో రైతుల్ని చంపినట్లు ఆరోపణలు రావడం, అంతకు ముందు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా సైతం రైతుల్ని బెదిరించిన వీడియోలు వెలుగులోకి రావడం తెలిసిందే. మంత్రిని పదవి నుంచి తొలగించి, ఆయన కొడుకును అరెస్టు చేయాలనే డిమాండ్ తో యూపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన విపక్ష నేతలను యూపీ పోలీసులు అడ్డుకోవడంపై దేశవ్యాప్తంగానూ నిరసనలు జరిగాయి. కాగా,

ఎన్నికల ముందు యూపీలో బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసి లఖీంపూర్ ఘటన మొత్తం అజయ్ మిశ్రా చుట్టూ తిరుగుతున్నా, ఆయన తొలగింపునకు సొంత పార్టీ లోనూ డిమాండ్లు వస్తున్నా బీజేపీ హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మిశ్రా తన పదవికి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వచ్చినా ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ పరిస్థితిలో లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యంతోనైనా బాధితులకు న్యాయం దొరుకుతుందో లేదో చూడాలి..
Published by:Madhu Kota
First published:

Tags: Farmers Protest, Supreme Court, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు