పూరి జగన్నాథ్ రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే.. కీలక వ్యాఖ్యలు

ఒకవేళ రథయాత్రకు అనుమతిస్తే... ఆ జగన్నాథుడు తమను క్షమించడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: June 18, 2020, 2:09 PM IST
పూరి జగన్నాథ్ రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే.. కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో లక్షణాది మంది భక్తులు హాజరయ్యే పూరి జగన్నాధుడి రథయాత్ర నిర్వహించవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై స్టే విధించింది. ఒకవేళ రథయాత్రకు అనుమతిస్తే... ఆ జగన్నాథుడు తమను క్షమించడని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే వ్యాఖ్యానించారు. 2020లో ఒడిశాలో ఎక్కడా రథయాత్ర నిర్వహించకూడదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జూన్ 23 నుంచి నిర్వహించే రథయాత్రపై స్టే విధించాలని ఓ ఎన్జీవో సంస్థ జూన్ 15న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రథయాత్ర జరిగితే కరోనా మరింతగా విస్తరించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. అయితే భక్తుల లేకుండా రథయాత్ర నిర్వహించాలని భావిస్తున్న పూరి జగన్నాథ్ ఆలయ ట్రస్ట్... ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జూన్ 30 వరకు ఒడిశాలో మతపరమైన ఉత్సవాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
First published: June 18, 2020, 2:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading