SUPREME COURT SERIOUS AND SENSATIONAL COMMENTS ON FREE SCHEMES NOTICES ISSUED TO CENTER AND EC EVK
Supreme Court: ఇది చాలా సీరియస్ అంశం.. ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు కామెంట్.. కేంద్రం, ఈసీ నోటీసులు జారీ!
ప్రతీకాత్మక చిత్రం
Supreme Court | దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత పథకాలు హామీలపై సుప్రీం కోర్ట్ సీరియస్ కామెంట్ చేసింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గెలిచిన తర్వాత ఫ్రీగా గిఫ్ట్లు ఇవ్వడం.. ఉచిత పథకాలు హామీల (Promise of freebies) పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత పథకాలు హామీలపై సుప్రీం కోర్ట్ (Supreme Court) సీరియస్ కామెంట్ చేసింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గెలిచిన తర్వాత ఫ్రీగా గిఫ్ట్లు ఇవ్వడం.. ఉచిత పథకాలు హామీల (Promise of freebies) పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ పార్టీలు (Political Parties) వేసిన పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు.. ఈ విషయమై కేంద్రానికి, ఎన్నికల కమిషన్కు నోటీసులు ఇచ్చింది. ఈ సందర్భంగా సీరియస్ కామెంట్స్ చేసింది. ఎన్నికలకు ముందు ఓటర్లకు ప్రజా నిధుల నుంచి ఉచిత బహుమతులు ఇస్తామని, లేక ప్రలోభపెట్టేందుకు ఉచిత బహుమతులు పంపిణీ చేస్తామని చెప్పడం ఎన్నికల రంగంలో సమాన అవకాశాల సూత్రాన్ని ప్రభావితం చేస్తుందని రాజకీయ పార్టీలు ఉచిత బహుమతులు ఇవ్వడం, వాగ్దానం చేయడం ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నమని, ఇది ఒక రకంగా లంచమేనని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది.
హామీలు బడ్జెట్ను దాటిపోతున్నాయి..
అయితే ఈ పిటిషన్లో ఎంపిక చేసిన రాష్ట్రాలు, రాజకీయ పార్టీల ప్రస్తావనపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు జస్టీస్ ఎన్వీ రమణ. ఇది చాలా సీరియస్ (Serious) అంశమని, ఉచిత హామీల బడ్జెట్ సాధారణ బడ్జెట్ను దాటిపోతోందని అభిప్రాయపడ్డారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో..
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో సాధారణ ఓటర్లకు ఉచిత విద్యుత్ (Free Powe Supplyw), ఇతర సౌకర్యాలు కల్పిస్తామని అన్ని రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
అన్ని పార్టీలు ప్రతి ఎన్నికల్లోనూ రైతు రుణమాఫీ పెద్ద ఎన్నికల ఆకర్షనీయమైన హామీగా నిలుస్తోందంటూ పిటిషన్ పేర్కొన్నారు. బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ ఈ పిటీషన్ దాఖలు చేయగా.. నాలుగు వారాల్లోగా స్పందన తెలపాలని ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను కోరింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.