ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూత

Ram Jethmalani : ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది రాంజెఠ్మలానీ (95)... తుదిశ్వాస విడిచారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 9:26 AM IST
ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ కన్నుమూత
రాంజెఠ్మలానీ
  • Share this:
దేశంలో ఎన్నో సుదీర్ఘ కేసుల్ని వాదించిన... ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది రాంజెఠ్మలానీ తుదిశ్వాస విడిచారు. 95 ఏళ్ల వయసులో ఆయన... అనారోగ్యంతో... తన ఇంట్లోనే కన్నుమూశారు. దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్‌గా ఆయన పేరు పొందారు. ఆయన వాదిస్తే... ప్రత్యర్థి లాయర్లు ఎవరైనా చిత్తు కావాల్సిందే. ఇదివరకు ఆయన వాదించిన కేసుల్లో 90 శాతం వరకూ విజయం సాధించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా... దేశంలోనే ప్రముఖ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల తరపున ఎన్నో కేసులు వాదించారు రాంజెఠ్మలానీ. అందువల్ల ఆయనకు దేశంలోనే అత్యంత కీలకమైన, ప్రముఖమైన లాయర్‌గా గుర్తింపు లభించింది.

సెప్టెంబర్ 14, 1923న జన్మించిన రాం జెఠ్మలానీ... 17 ఏళ్లకే లా పూర్తి చేసి... ఇంట్లోనే (అప్పట్లో పాకిస్థాన్‌లో) ప్రాక్టీస్ ప్రారంభించారు. దుర్గా జెఠ్మలానీని పెళ్లి చేసుకున్నారు. తర్వాతి కాలంలో ఆయన రత్న జెఠ్మలానీని కూడా వివాహం చేసుకున్నారు. పాకిస్థాన్ విభజన తర్వాత ఆయన ముంబై వచ్చారు. కొత్త జీవితం ప్రారంభించారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. 2017 సెప్టెంబర్ 10న ఆయన తన న్యాయవాద వృత్తికి రిటైర్మెంట్ ప్రకటించారు. ఐతే... 90 ఏళ్ల వయసులో... పార్వతి అనే మహిళ ఆయన జీవితంలోకి రావడం వివాదం రేపింది.

లాయర్‌గా, రాజకీయ నేతగా గుర్తింపు పొందిన రాంజెఠ్మలానీ... బీజేపీ నుంచీ లోక్ సభకు రెండు సార్లు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయ్ హయాంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా చేసిన ఆయన... బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా కూడా పనిచేశారు.

రాం జెఠ్మలానీ... లాయర్‌గా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. హై-ప్రొఫైల్ వ్యక్తులకు మాత్రమే వాదిస్తారనీ, హై-ప్రొఫైల్ వస్తువుల్ని, వాహనాల్ని మాత్రమే వాడతారని ఆయనపై విమర్శలున్నాయి. అంతేకాదు... ఆయన ఏ కేసు వాదించినా... గంటకు ఇంత చొప్పున వసూలు చేస్తుండటం కూడా వివాదాలకు దారితీసింది. పైగా... ఆయన కేసు విషయంలో ఎక్కడికి వెళ్లినా... తనతోపాటూ... మరో ఐదారుగురిని సహాయకులుగా తీసుకెళ్తారు. వాళ్లందరికీ అయ్యే ఖర్చులను కూడా క్లైంట్స్ పైనే వేస్తారు. జెఠ్మలానీలా వాదించడం మిగతా లాయర్ల వల్ల కాకపోవడంతో... ఆయన రేంజ్ అలా సాగింది.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>