Home /News /national /

SUPREME COURT SEEKS REPORT FROM AVIATION MINISTRY AND AIRLINES REGARDING TICKET CANCELLATION AMOUNT TO PASSENGERS AK

‘ప్రయాణికులకు డబ్బులు ఎలా చెల్లిస్తారో తేల్చండి’

వందే భారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయి.

వందే భారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయి.

లాక్‌డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి చెల్లించకుండా... ఏడాది కాలంలో వాళ్లు మళ్లీ ఎప్పుడైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చని విమానయాన సంస్థలు చెప్పడం సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు.

    లాక్‌డౌన్ సమయంలో విమాన టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు ఏ విధంగా తిరిగి చెల్లిస్తారనే దానిపై కేంద్ర విమానయాన శాఖ నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం, విమానయాన సంస్థలు కలిసి చర్చించి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించే అంశంపై చర్చించాలని కోరింది. విమానయాన సంస్థలు ఈరకంగా వ్యవహరించడం పూర్తిగా చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లాక్‌డౌన్ సమయంలో టికెట్లు బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగి చెల్లించకుండా... ఏడాది కాలంలో వాళ్లు మళ్లీ ఎప్పుడైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చని విమానయాన సంస్థలు చెప్పడం సరికాదని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది డీజీసీఏ రూల్స్‌కు విరుద్ధమని స్పష్టం చేశారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం విమాన సర్వీసులు రద్దయితే క్రెడిట్ కార్డు హోల్డర్లకు వారం రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కౌంటర్‌లో టికెట్ కొనుగోలు చేసిన వారికి వెంటనే డబ్బులు చెల్లించాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Airlines, DGCA, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు