హోమ్ /వార్తలు /జాతీయం /

ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్ల రక్తదానంపై నిషేధాన్ని సవాలు చేస్తు పిటిషన్.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు..

ట్రాన్స్‌జెండర్లు, సెక్స్ వర్కర్ల రక్తదానంపై నిషేధాన్ని సవాలు చేస్తు పిటిషన్.. కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు..

సుప్రీంకోర్టు (ఫైల్ ఫొటో)

సుప్రీంకోర్టు (ఫైల్ ఫొటో)

ట్రాన్స్‌జెండర్స్, సెక్స్ వర్కర్లు(మగ, ఆడ) నుంచి రక్తం స్వీకరించకుండా కేంద్రం విధించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీకం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.

  ట్రాన్స్‌జెండర్స్, సెక్స్ వర్కర్లు(మగ, ఆడ) నుంచి రక్తం స్వీకరించకుండా కేంద్రం విధించిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీకం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని తెలియజేయాల్సిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం కోరింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. జాతీయ రక్త మార్పిడి మండలి (NBTC), జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO)లకు నోటీసులు జారీచేసింది. అయితే ఈ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. న్యాయస్థానానికి శాస్త్రీయ విషయాలలో నైపుణ్యం ఉండదని పేర్కొంది.

  ట్రాన్స్‌జెండర్ల నుంచి రక్తం స్వీకరించకూడదంటూ 2017లో కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యుడు తంగ్జమ్ శాంటా సింగ్..ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ మార్గదర్శకాలలోని 12, 51నిబంధనల్లో.. లింగమార్పిడి వ్యక్తులు, స్వలింగ సంపర్కులు, మహిళ సెక్స్ వర్కర్లను అధిక ప్రమాదం ఉన్న HIV/AIDS కేటగిరి వర్గంగా ఏకపక్షంగా భావించారని, అలాగే వారిని రక్తదానం చేయకుండా నిషేధించారని పిల్‌లో పేర్కొన్నారు. ఆ నిబంధనలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.

  "రక్తదాతల నుంచి సేకరించిన అన్ని రక్త యూనిట్లకు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ సహా అంటు వ్యాధులు పరీక్షలు నిర్వహిస్తారని.. అలాంటప్పుడు ట్రాన్స్‌జెండర్లను వారి జెండర్ కారణంగా హై రిస్క్ కేటగిరిగా నిర్ణయించి, వారి రక్తం స్వీకరించడం సరికాదు. ఇది లైంగిన వివక్షతో పాటుగా రక్తదాతలో సమానంగా వ్యవహరించే వారి హక్కును ఉల్లంఘించినట్టే" అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Blood donation, Supreme Court, Transgender

  ఉత్తమ కథలు