Home /News /national /

SUPREME COURT SAYS TV DEBATES FIRECRACKERS MORE POLLUTION THAN FARMERS HEARING ON DELHI AIR POLLUTION MKS

టీవీ డిబేట్లతో ఇంకా కాలుష్యం -పటాకులు పేల్చి రైతుల్ని నిందిస్తారా? : supreme court ఫైర్

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్

ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్

దీపావళినాడు పటాకులు పేల్చిన ఉన్నత వర్గాలు.. కాలుష్యానికి రైతులే కారణమని నిందిస్తున్నాయని, టీవీ డిబేట్లతో కాలుష్యం ఇంకా పెరుగుతోందని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో కాలుష్యం విపరీతంగా పెరిగి, ఎయిర్ క్వాలిటీ పడిపోవడంప విచారణ జరుపుతోన్న సుప్రీంకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలిచ్చింది..

ఇంకా చదవండి ...
‘ఖరీదైన సెవెన్ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో కూర్చున్న వ్యక్తులు.. వాయికాలుష్యానికి రైతులను నిందిస్తున్నారు. ఇదే వ్యక్తులు తాము దీపావళినాడు పటాకులు కాల్చిన విషయాన్ని కన్వీయియంట్ గా విస్మరిస్తారు. ఇది చాలదన్నట్లు మీడియాలో చర్చలు. నిజానికి టీవీ డిబేట్లతో ఇంకా కాలుష్యం (Pollution) పెరుగుతున్నది. వార్తా పత్రికలు తమ అజెండాల మేరకు ఢిల్లీ ఎయిర్ క్వాలిటీకి భిన్నమైన కథనాలు ప్రచురిస్తున్నాయి..’ అంటూ తీవ్ర అసహనాన్ని వెలిబుచ్చారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని వాయుకాలుష్యంపై బుధవారం కూడా సుప్రీంకోర్టు (Supreme court) ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

ఢిల్లీ, ఎన్సీఆర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి, ఎయిర్ క్వాలిటీ పడిపోయిన దరిమిలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడం తెలిసిందే. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసం ఇప్పటికే కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఢిల్లీ ప్రభుత్వం తరఫున అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలను వినిపించారు. బుధవారం నాటి విచారణలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది..

shocking : మనవరాలి శవం పక్కనే.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం -కసి ఈనాటిది కాదంటూ..


దీపావళినాడు పటాకులు పేల్చిన ఉన్నత వర్గాలు.. కాలుష్యానికి రైతులే కారణమని నిందిస్తున్నాయని, టీవీ డిబేట్లతో కాలుష్యం ఇంకా పెరుగుతోందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్రం తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. అనుమతి లేని ఇంధనాన్ని ఉపయోగించే పరిశ్రమలను మూసివేయాలని ఢిల్లీ, సహా ఎన్సీఆర్ విస్తరించిన నాలుగు రాష్ట్రాలకూ కేంద్రం (కమిషన్ ఫర్ ఎయిర్ క్వారిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం)) ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. కాగా, కేంద్రం ప్రతిపాదించిన వాటిలో 90 శాతం తామే చేశామని, పగలు, రాత్రి పెట్రోలింగ్‌తో తాము పరిశీలిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వ తరఫు లాయర్ సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గోధుమ పొట్టు తగులబెట్టకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్‌లను ఆదేశించామని హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Hyderabad: ఏం ఫ్యామిలీరా బాబూ! -19ఏళ్ల కూతురిని అందంగా ముస్తాబు చేసి.. వీళ్ల కథే వేరు!


రైతులను జరిమానాలు విధించాలని కోర్టు భావించడం లేదని, పటాకుల విషయంలోనూ తమ ఆందోళనంతా కాలుష్యం గురించేనని బెంచ్ పేర్కొంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వారిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) చేసిన సూచనలను అన్ని రాష్ట్రాలూ విధిగా పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన సీఏక్యూఎం గురువారం రాత్రి.. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

Delhi : ఆ దెబ్బకు ఢిల్లీ మూసివేత -నిర్మాణ పనులు, బడులు బంద్, థర్మల్ విద్యుత్ నిలిపివేత : కేంద్రం ఆదేశాలివే


ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలను పూర్తిగా మూసివేయడం, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో కనీసం 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయడం, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో ఉన్న యూపీలోని నోయిడాలో అన్ని రకాల నిర్మాణ పనులు, ఆర్‌ఎంసీ, హాట్‌ మిక్స్‌ప్లాంట్లు, డీజిల్‌ జనరేటర్ల వాడకాన్ని నాలుగు రోజుల పాటు పూర్తిగా నిలిపేయడం, ఢిల్లీ చుట్టూ 300 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 11 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఆరు ప్లాంట్లను మూసేయడం లాంటి సంచలన మార్గదర్శకాలను సీఏక్యూఎం జారీ చేసింది. వీటిని రాష్ట్రాలు విధిగా అనుసరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Published by:Madhu Kota
First published:

Tags: Delhi pollution, Supreme Court

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు