Home /News /national /

SUPREME COURT SAYS SUSPENDED BJP LEADER NUPUR SHARMA SHOULD APOLOGISE TO COUNTRY PVN

దేశ ప్రజలకు నుపూర్ శర్మ క్షమాపణ చెప్పాలి..ఆమె వల్లే ఇదంతా..సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

నుపుర్‌ శర్మ(ఫైల్ ఫొటో)

నుపుర్‌ శర్మ(ఫైల్ ఫొటో)

Supreme Court On Nupur Sharma : ఇటీవల ముస్లింల దైవం మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ కి గురైన నుపూర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు తెలిపింది. మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే.

ఇంకా చదవండి ...
Supreme Court On Nupur Sharma : ఇటీవల ముస్లింల దైవం మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ కి గురైన నుపూర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సుప్రీంకోర్టు తెలిపింది. మొహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శ‌ర్మ(Nupur Sharma)చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మైన విష‌యం తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో ఒక టీవీ చర్చ సందర్భంగా నుపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన అభ్యంతరకరమైన   వ్యాఖ్యలను పలు గల్ఫ్‌దేశాలు తీవ్రంగా ఖండించడం సహా  దేశంలో  భారీ నిరసనలకు దారితీశాయి.  ఆ వ్యాఖ్య‌ల అనంత‌రం ప‌లు చోట్ల అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి. రెండు రోజుల క్రితం రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ అనే ఓ టైల‌ర్‌ హ‌త్యకు కూడా నుపుర్ వ్యాఖ్య‌లే కార‌ణం. బీజేపీ బహిషృత నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని కన్హయ్య లాల్ అనే ఓ టైలర్(Tailor)ని ఇద్దరు ముస్లిం యువకులు దారుణంగా కత్తులతో నరికి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే, బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో... దేశ‌వ్యాప్తంగా త‌న‌పై న‌మోదు అయిన అన్ని ఎఫ్ఐఆర్‌ల‌ను ఢిల్లీకి ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)లో నుపూర్ శ‌ర్మ పిటిష‌న్ వేసింది. ఈ నేప‌థ్యంలో ఆ పిటిష‌న్‌ పై సుప్రీంకోర్టు స్పందిస్తూ...నుపూర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని,దేశ వ్యాప్తంగా ఆమె భావోద్వేగాలను రగిలించిన తీరు వల్ల ప్రస్తుతం దేశంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు ఆమె ఒక్క‌రే వ్య‌క్తిగ‌తంగా బాధ్యురాల‌ని పేర్కొంది.

Udaipur Murder Case : ఉదయ్ పూర్ హత్య..కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం

టీవీ చ‌ర్చ స‌మ‌యంలో ఆమెను ఎలా రెచ్చగొట్టారనే చర్చ చూశాం. ఆ తర్వాత తాను లాయర్ అని నుపూర్ శర్మ చెప్పిన ఆమె తీరు సిగ్గుచేటు. ఆమె మాట్లాడిన తీరు ఆందోళ‌న‌ల‌కు దారి తీసింది. ఆమె దేశం మొత్తానికి క్షమాపణ చెప్పాలి అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. చంపేస్తామంటూ బెదిరింపులు వ‌స్తున్నాయ‌ని నుపుర్ వేసిన పిటిష‌న్‌పై ..ఆమెకు బెదిరింపులు వ‌స్తున్నాయా లేక ఆమె భద్రతకు స‌మ‌స్య‌గా మారిందా అని సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

నుపూర్​ వ్యాఖ్యలు ఆమె అహంకారపూరిత వైఖరిని స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. చర్చా కార్యక్రమంలో యాంకర్ ప్రశ్నకు నుపూర్‌ శర్మ సమాధానం ఇచ్చారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పగా అలాంటప్పుడు ఈ కేసులో యాంకర్‌ను కూడా ప్రాసిక్యూట్ చేయాలని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. నుపూర్‌ శర్మ పిటిషన్‌ పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరిండంతో..పిటిషన్ ను నుపూర్ వెనక్కి తీసుకున్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Supreme Court

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు