18 ఏళ్లు దాటిన వ్యక్తులు తమకు నచ్చిన మతం ఎంచుకోవచ్చు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చేతబడి, మతమార్పిడిలను నివారించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీం కోర్టులో న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిన్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గావై జస్టిస్ హృషికేష్ రాయ్‌ల నేతృత్వంలోని ధర్మాసం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అశ్వినీ ఉపాధ్యాయ తరఫున ధర్మాసనం ముందు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది.. గోపాల్ శంకరనారాయణను సుప్రీం కోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 32 ప్రకారం ఇది ఏ రకమైన పిటిషన్ అని ప్రశ్నించింది. గోపాల్ శంకరనారాయణ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అలాగే 18 ఏళ్లు పైబడినవారు తమకు నచ్చిన మతం ఎంచుకుంటే అడ్డుకోవడానికి ఎలాంటి కారణం లేదని జస్టిన్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గావై జస్టిస్ హృషికేష్ రాయ్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. రాజ్యాంగంలో propagate అనే పదం ఉండటానికి ఒక కారణం ఉందని తెలిపింది. సుప్రీం కోర్టు పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పిటిషన్‌ను ఉపసంహరించడానికి న్యాయవాది గోపాల్ శంకరనారాయణ అనుమతి ఇవ్వాలని అడిగారు. ఈ పిటిషన్‌ను ప్రభుత్వానికి, న్యాయ కమిషన్‌కు నివేదించడానికి కూడా అనుమతి కోరారు. అయితే ఇందుకు అనుమతి ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది.
Andhra Pradesh: ఆర్టీసీ బస్సులో రూ. 3 కోట్లు సీజ్.. చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో..
Telangana: ఏప్రిల్ నుంచే ప్రైవేటు టీచర్లకు సాయం.. బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు వేస్తారంటే..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National News, Supreme Court