కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న పిటిషన్ను నేడు విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఐఎన్ఎక్స్-మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టను ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్ పిటిషన్ను నిన్న అత్యవసరంగా విచారించడానికి అంగీకరించలేదు. ఈ రోజు కూడా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరోవైపు చిదంబరం కోసం నిన్నటి నుంచి సీబీఐ వెతుకుతోంది. ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో చిదంబరం కోసం లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లే అవకాశం లేకుండా ఈ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. చిదంబరం మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడంపై సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chidambaram, Supreme Court