హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Supreme court: ఢిల్లీ సరిహద్దులో రైతుల ధర్నాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ధర్నాలు చేసుకోండి.. కానీ...

Supreme court: ఢిల్లీ సరిహద్దులో రైతుల ధర్నాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. ధర్నాలు చేసుకోండి.. కానీ...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సుప్రీంకోర్టు (supreme court)లో కొందరు రైతుల తరఫున పటిషన్లు చేస్తే మరికొందరు రోడ్డుపై రైతులు చేస్తున్న ధర్నాల వల్ల తమ రోజువారి కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇంకా చదవండి ...

  కేంద్ర ప్రభుత్వం (Union government) తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలు (Laws of agricultural reform)  రద్దు చేసేంత వరకు ఆందోళనలు విరమించేది లేదని రైతులు (farmers) చెబుతున్నారు. సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi borders) కొన్ని నెలలుగా వివిధ రాష్ట్రాల రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రైతుల ప్రయోజనాల కోసమే మూడు కొత్త చట్టాలు చేశామని కేంద్రం (center) చెబుతోంది. అవసరమైతే చట్టాల్లో సవరణలు చేస్తాం కానీ, వాటిని రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్రం అంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై చాలావరకు కేసులు సుప్రీంకోర్టు (supreme court)లో నమోదయ్యాయి. చాలామంది ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (Public interest litigation) దాఖలు చేశారు. కొందరు రైతుల తరఫున పటిషన్లు చేస్తే మరికొందరు రోడ్డుపై రైతులు చేస్తున్న ధర్నాల వల్ల తమ రోజువారి కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది.

  నిరసనల పేరుతో రోడ్లను బ్లాక్ (roads blocking) చేసే హక్కు (rights) ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో అన్నదాతలు ఏడాదిగా నిరసనలు (protests) చేస్తున్నారు. ఈ నిరసనల వల్ల పలుమార్లు ఢిల్లీలో రోడ్లు బ్లాక్ (block) అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు క్యాంప్ వేసుకుని నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల బ్లాకేజీ వల్ల ప్రజల రోజువారీ కార్యకలాపాలు (people daily routines), ప్రయాణాలకు (passengers) ఇబ్బంది ఏర్పడుతోందంటూ నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్ అనే మహిళ సుప్రీంలో ఓ పిటిషన్ (petition) దాఖలు చేశారు.. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.

  రైతుల సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనాలని ధర్మాసనం (bench) సూచించింది.. వారికి నిరసనలు తెలిపే హక్కుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. కానీ, రోడ్లను రైతులు బ్లాక్ చేయడం సరికాదని పేర్కొంది. ఇతర పద్ధతుల్లో నిరసనలను తెలుపుకోవచ్చని సూచించింది. రోడ్లను బ్లాక్ చేయొద్దని జస్టిస్ ఎస్‌కే కౌల్, ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.

  ఈ విషయంపై మూడు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ వేయాలని రైతు సంఘాలను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Farmers, Supreme Court

  ఉత్తమ కథలు