హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు జరిమానా

మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. పిటిషనర్‌కు సుప్రీంకోర్టు జరిమానా

సబ్‌స్క్రైబ్ స్క్రీమ్ కింద దీన్ని కొనుగోలు చేస్తే ఈ ధర 25.10 యూరోలు పడుతుంది.

సబ్‌స్క్రైబ్ స్క్రీమ్ కింద దీన్ని కొనుగోలు చేస్తే ఈ ధర 25.10 యూరోలు పడుతుంది.

మద్యాన్ని నిషేధించాలని పిటిషన్ వేసిన లాయర్లకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. పబ్లిసిటీ కోసమే పిటిషన్ వేశారంటూ చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు.

    మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్..! లాక్‌డౌన్‌లో మద్యం అమ్మకాలను నిలిపివేయాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అంతేకాదు మద్యాన్ని నిషేధించాలని పిటిషన్ వేసిన లాయర్లకు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. పబ్లిసిటీ కోసమే పిటిషన్ వేశారంటూ చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిర్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

    కాగా, మే 8న తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. కేవలం ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలకు చేపట్టాలని... ఇంటికే మద్యం సరఫరా చేయేాలని స్పష్టం చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పరేషన్ ద్వారా నడిచే అన్ని షాపులను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొంది హైకోర్టు. మద్యం షాపుల నిర్వహణ తీరుపై MNM అధినేత, సినీనటుడు కమల్ హాసన్‌తో పాటు పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన జస్టిన్ వినీత్ కొటారి, జస్టిస్ పుష్ప సత్యానారాయణ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్.. వైన్ షాపులను మూసివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేవలం ఆన్‌లైన్ అమ్మకాలకు మాత్రమే అనుమతిచ్చింది. ఐతే ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించి.. తమిళనాడులో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Liquor sales, Liquor shops, Tamilnadu, Wine shops

    ఉత్తమ కథలు