Home /News /national /

SUPREME COURT RELEASES NEW ROSTER PILS TO BE HEARD BY CJI AND 3 SENIOR MOST JUDGES MS

సుప్రీం కోర్టు కొత్త రోస్టర్ : ఏ బెంచ్ ఏయే కేసులను విచారిస్తుంది..?

సుప్రీంకోర్టు (File)

సుప్రీంకోర్టు (File)

ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కాకుండా కోర్టు ధిక్కరణ,ఎన్నికలు,హెబియస్ కార్పస్,సామాజిక న్యాయం,ప్రత్యక్ష పరోక్ష పన్నుల పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని ధర్మాసనమే విచారిస్తుంది.

    దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కొత్త రోస్టర్ విధానం అమలులోకి వచ్చింది. కొత్త విధానం ప్రకారం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేతో పాటు ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, లెటర్ పిటిషన్స్ విచారించనున్నారు. సీజేఐ నేత్రుత్వంలోని ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎన్వీ రమణ,అరుణ్ మిశ్రా,ఆర్ఎఫ్ నారిమణ్ ఉన్నారు. కొత్త రోస్టర్ ప్రకారం కేసుల విచారణ కేటాయింపులు నవంబర్ 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.

    ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కాకుండా కోర్టు ధిక్కరణ,ఎన్నికలు,హెబియస్ కార్పస్,సామాజిక న్యాయం,ప్రత్యక్ష పరోక్ష పన్నుల పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని ధర్మాసనమే విచారిస్తుంది. వీటితో పాటు క్రిమినల్ కేసుల్లో సంబంధిత కమిషన్స్‌ వేసిన పిటిషన్స్‌ను కూడా సీజేఐ నేత్రుత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది. అలాగే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ&ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్లను కూడా విచారిస్తుంది.

    జస్టిస్ రమణ నేత్రుత్వంలోని ధర్మాసనం సాయుధ దళాలు,పారామిలటరీ,నష్ట పరిహారం,జ్యుడీషియల్ అధికారులకు సంబంధించిన క్రిమినల్&సివిల్ కేసులు,గుత్తాధిపత్య మరియు నిర్బంధ వాణిజ్య పద్ధతులకు సంబంధించిన పిటిషన్లను విచారిస్తుంది.వీటితో పాటు స్పెషల్ లీవ్ పిటిషన్స్, కమర్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన పిటిషన్లను విచారిస్తుంది.

    జస్టిస్ అరుణ్ మిశ్రా నేత్రుత్వంలోని ధర్మాసనం కోర్టు ధిక్కరణ, భూసేకరణ,మెడికల్ కాలేజీ కోటా,చట్టబద్ధమైన సంస్థలు మరియు విద్యా సంస్థల గుర్తింపుకు
    సంబంధించిన పిటిషన్లను విచారిస్తుంది.ఇక జస్టిస్ ఆర్ఎఫ్ నారిమణ్ నేత్రుత్వంలోని ధర్మాసనం ఫ్యామిలీ లా, సాయుధ దళాలు, పారమిలటరీ బలగాలు,లీజులు, ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల కాంట్రాక్టులకు సంబంధించిన పిటిషన్లను విచారిస్తుంది. జస్టిస్ ఆర్ బానుమతి నేత్రుత్వంలోని
    ధర్మాసనం లేబర్,భూ చట్టాలు,కౌలుకు సంబంధించిన పిటిషన్లను విచారిస్తుంది. అపెక్స్ కోర్టు కొలీజియంలో సీజేఐతో పాటు జస్టిస్ రమణ,మిశ్రా,నారిమణ్,
    బానుమతి ఉంటారు.
    Published by:Srinivas Mittapalli
    First published:

    Tags: SA Bobde, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు