కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు (Central Vista) ఆపాలని వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు (Supreme Court) కొట్టివేసింది. కొత్త పార్లమెంట్ భవన సముదాయం ‘పబ్లిక్ రిక్రియేషనల్’ జోన్‌పై ప్రభావం చూపుతుందని కోర్టులో పిటిషన్ దాకలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ‘ఇక్క డ ప్రైవేటు ఆస్తిని సృ ష్టిం చడం లేదు. ఉపరాష్ట్రపతి (Vice President) నివాసాన్ని ఏర్పా టు చేస్తున్నా రు. చుట్టూ పచ్చ దనం ఉం టుం ది. ఈ ప్రణాళికకు ఇప్ప టికే అధికారులు ఆమోదం తెలిపారు’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కారణంగా కొన్ని ప్రాం తాలను ‘పబ్లిక్ రిక్రియేషనల్’ నుంచి ‘రెసిడెన్షియల్’గా మార్చా రని ఆరోపిస్తూ.. రాజీవ్ సూరి అనే సామాజిక కార్య కర్త పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి..
ఈ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మనం ప్రతీ దాన్ని విమర్శించ వచ్చు కానీ.. ఆ విమర్శ నిర్మణాత్మకంగా ఉండాలని కోర్టు పేర్కొంది.
National Scholarship: వారం రోజులే గడువు.. రూ.70వేల స్కాలర్షిప్ పొందేందుకు అప్లై చేసుకోండి
DCCB Recruitment 2021: నెల్లూరు డీసీసీబీలో ఉద్యోగాలు.. జీతం రూ. 33,000
ఈ ప్రాజెక్టు వల్ల ప్రస్తుతం ప్రజల వినోదం కోసం ఉద్దేశించిన ప్రాంతంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరుఫు న్యాయవాది వాదించారు. అయితే అభివృ ద్ధి ప్రణాళికలో మార్పులు చేయడం అనేది కోర్టు పరిధి అంశం కాదని స్పష్టం చేసింది.
ఏమిటీ సెంట్రల్ విస్టా?
ప్రభుత్వం మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. మొత్తం 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లెమెంట్ (Parliment) భవనాన్ని నిర్మించనున్నారు. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.971 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ భవన నిర్మాణ బాధ్యతలను దిగ్గజ సంస్థ ‘టాటా’ చేపట్టింది. వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాటికి నూతన పార్లమెంట్ భవన నిర్మాణం పూర్తి చేసి, కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రతిపక్షాల విమర్శలు..
ఈ ప్రాజెక్టులో భాగంగా పార్లమెంట్ భవనం, మంత్రిత్వ శాఖ కార్యా లయాలను పునర్నిర్మిస్తున్నారు. అయితే దేశంలో కరోనా విజృం భణ కొనసాగుతున్నప్పటికీ.. కేంద్రం సెంట్రల్ విస్టాకే ప్రాధాన్యం ఇస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం భవన నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.