మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

లిక్కర్ విక్రయాలను ఆపబోమని, అయితే, రాష్ట్రాలు హోం డెలివరీ చేసే అవకాశాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది

news18-telugu
Updated: May 8, 2020, 2:23 PM IST
మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మద్యం విక్రయాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ లాక్ డౌన్ పూర్తికాకుండానే మద్యం విక్రయాలు ప్రారంభించడాన్ని తప్పుపడుతూ, వాటిపై నిషేధం విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ విక్రయాలను ఆపబోమని, అయితే, రాష్ట్రాలు హోం డెలివరీ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకుండానే ప్రజలు మద్యం కోసం బయటకు రావడంతో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిల్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. రద్దీని తగ్గించేందుకు ఆన్ లైన్ ద్వారా లేదా హోమ్ డెలివరీ విధానాలు అవలంబించవచ్చని సూచించింది. మద్య నిషేధం మీద తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, అది పాలసీ నిర్ణయం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

మద్యం విక్రయాలు జరిపే ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించడం లేదంటూ పిటిషనర్ తరఫున న్యాయవాదులు వాదించారు. లిక్కర్ షాపులు సంఖ్య తక్కువగా ఉండడంతో, మద్యం ప్రియులు భారీగా క్యూ కడుతున్నారని చెప్పారు. అయితే, దీనికి సంబంధించి తాము రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోమని, కావాలంటే ఆన్ లైన్, హోం డెలివరీ వంటి ఆప్షన్లను రాష్ట్రాలు అవలంభించాలని సూచించింది.
First published: May 8, 2020, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading