Babri Masjid Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై తీర్పు ఇచ్చిన రిటైర్డ్ సీబీఐ జడ్జి ఎస్.కే.యాదవ్‌కి సెక్యూరిటీని పొడిగించే అంశాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. తనకు సెక్యూరిటీని కంటిన్యూ చెయ్యాలని జడ్జి యాదవ్ కోరారు. తనను ప్రాణహాని ఉందని తన అభ్యర్థనలో తెలిపారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. సెక్యూరిటీని పొడిగించాల్సిన అవసరం ఉందని తాము భావించట్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అంతగా ప్రాణహాని ఉంది అని భావిస్తే... సొంతంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని జస్టిస్ ఎఫ్.నారిమన్ సారధ్యంలోని బెంచ్ సూచించింది. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు:
ఈ సంవత్సరం సెప్టెంబర్ 30న... బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే యాదవ్... 2000 పేజీల ఆర్డర్ కాపీ తీర్పును వెలువరించారు. ఈ కేసులో నిందితులంతా నిర్దోషులే అని తీర్పు వెలువరించారు. కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని తేల్చారు. కూల్చివేత పథకం ప్రకారం జరిగింది అనేందుకు ఆధారాలు లేవని జడ్జి తెలిపారు. కూల్చివేతకు ఎవరూ రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యలేదనీ, కుట్రపూరితంగా వ్యవహరించలేదని తెలిపారు. బాబ్రీ మసీదును కూల్చివేసింది కరసేవకులు కాదనీ... సంఘ విద్రోహ శక్తులు ఆ పని చేశారని తెలిపారు. ఈ కూల్చివేత కేసును కొట్టివేశారు. దీంతో అద్వానీ, మురళీ మనోనహర్ జోషి, సంఘ్ పరివార్ నాయకులు సహా నిందితులందరికీ ఉపశమనం లభించినట్లైంది. ఈ కేసులో 48 మంది నిందితుల్లో 16 మంది చనిపోగా... ఆరోపణలు ఎదుర్కొన్న, బతికివున్న 32 మంది బతికివున్నారు. వారంతా నిర్దోషులుగా మారారు. రిటైర్ అయ్యే చివరి రోజున జస్టిస్ యాదవ్ ఈ తీర్పు ఇచ్చారు. తనకు సెక్యూరిటీని కంటిన్యూ చెయ్యమని అప్పుడే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకున్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు పూర్వాపరాలు:
అయోధ్యలో రామాలయం ఉన్న ప్రదేశంలో... దాన్ని కూల్చి... బాబ్రీమసీదును నిర్మించారనే అంశంతో... ఆ మసీదును కూల్చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. 1992లో దేశవ్యాప్తంగా కరసేవకులు అయోధ్యకు తరలివచ్చారు. ఒక్కసారిగా బాబ్రీ మసీదును చేరారు. డిసెంబర్ 6న మసీదు ధ్వంసమైంది. దేశం మొత్తం ఆశ్చర్యంగా చూసింది. ఆ సమయంలో... పెద్ద ఎత్తున దేశమంతా మత ఘర్షణలు జరిగాయి. వాటిలో 1800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Supreme Court