Home /News /national /

SUPREME COURT RECOGNISES SEX WORK AS A PROFESSION PVN

Supreme Court : సెక్స్ వర్క్ కూడా ఓ ప్రొఫెషన్..వారిని వేధించొద్దంటూ సుప్రీం కీలక ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Supreme Court On Sex Workers : సెక్స్ వర్క్ కూడా ఓ "వృత్తి" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యభిచారం అనేది వృత్తి అని, చట్ట ప్రకారం సెక్స్ వర్కర్లు కూడా గౌరవం మరియు సమాన రక్షణకు అర్హులని తెలిపింది. స్వచ్చంద వ్యభిచారం(కన్సెంటింగ్ సెక్స్) నేరం కాదం కాదని,సెక్స్ వర్కర్లపై పోలీసులు జోక్యం చేసుకోవద్దని లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇంకా చదవండి ...
Supreme Court On Sex Workers : సెక్స్ వర్క్ కూడా ఓ "వృత్తి" అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యభిచారం అనేది వృత్తి అని, చట్ట ప్రకారం సెక్స్ వర్కర్లు కూడా గౌరవం మరియు సమాన రక్షణకు అర్హులని తెలిపింది. స్వచ్చంద వ్యభిచారం(కన్సెంటింగ్ సెక్స్) నేరం కాదం కాదని,సెక్స్ వర్కర్లపై పోలీసులు జోక్యం చేసుకోవద్దని లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. సెక్స్‌వర్కర్లపై వేధింపులపై 2016లో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గావై, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్యానెల్‌ సిఫార్సులను అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. సెక్స్ వర్కర్లను గౌరవంగా చూడాలని, వారిని వేధించడం, దూషించడం గానీ, భౌతికంగా గానీ సెక్స్‌వర్కర్ల మీద దాడి చేసే హక్కు గానీ పోలీసులకు ఉండబోదని కోర్టు పేర్కొంది. వారి అంగీకారంతోనే ఆ వృత్తి కొనసాగుతుంటే ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని సూచించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21కి అనుగుణంగా దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవంతో జీవించే హక్కు ఉందని బెంచ్ స్పష్టం చేసింది. ఈ మేరకు సెక్స్ వర్కర్లను వేధించకూడదని, వారిని అరెస్ట్ చేయకూడదని పేర్కొంది. ఆ వృత్తిలో ఉన్న‌ద‌నే ఏకైక కార‌ణంతో సెక్స్ వ‌ర్క‌ర్ పిల్ల‌ల‌ను త‌ల్లి నుంచి వేరుచేయ‌రాద‌ని ఆదేశించింది. సెక్స్ వర్కర్ల పట్ల వివక్ష చూపించరాదని చెప్పింది.

సెక్స్ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి తరచుగా క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుందని గమనించామని, తమ హక్కులకు గుర్తింపు లభించని వర్గం వారు అని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యభిచార గృహాలపై దాడులు జరిపిన సమయంలో పట్టుబడిన సెక్స్‌ వర్కర్ల ఫొటోలను ఎట్టిపరిస్థితుల్లోనూ మీడియా టెలిక్యాస్ట్ చేయరాదని సుప్రీం స్పష్టం చేసింది. అరెస్టులు, దాడులు, రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో బాధితులుగా లేదా నిందితులుగా ఉన్న సెక్స్ వర్కర్ల గుర్తింపును బహిర్గతం చేయకుండా మీడియా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తగిన మార్గదర్శకాలను విడుదల చేయాలని కోర్టు పేర్కొంది. ఏ మీడియా లేదా పబ్లిషర్లు వారి ఫొటోలు ప్రచురించినా గుర్తింపును వెల్లడించినా ఐపీసీ 354C ప్రకారం చర్యలు తీసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. లైంగిక వేధింపుల నుంచి బయటపడిన సెక్స్ వర్కర్లకు చట్టానికి అనుగుణంగా తక్షణ వైద్య సహాయంతో సహా అన్ని సౌకర్యాలను అందించాలని కోర్టు పేర్కొంది. తమ ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించిన వయోజన మహిళల కేసులను సమీక్షించి, వారిని గడువులోగా విడుదల చేసేందుకు వీలుగా షెల్టర్ హోమ్‌ల సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.

ALSO READ  కుక్కతో వాకింగ్ కోసం..స్టేడియాన్నే ఖాళీ చేయిస్తున్న ఐఏఎస్..సరిహద్దులకు అతడిని ట్రాన్స్ ఫర్ చేసిన కేంద్రం

మరోవైపు,సెక్స్‌వర్కర్లకు ఆధార్‌ కార్డులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆధార్ కార్డుల జారీ సమయంలో సెక్స్‌ వర్కర్ల గోప్యతను ఉల్లంఘించకూడదని, వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదని తెలిపింది. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (ఎన్‌ఎసిఒ)లోని గెజిటెడ్‌ అధికారి లేదా రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్ర సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సమర్పించే ఎన్‌రోల్‌మెంట్‌ ఫారం ఆధారంగా యుఐడిఎఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికెట్‌ ఆధారంగా సెక్స్ వర్కర్లకు ఆధార్‌ కార్డులివ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఆధార్ కార్డులు ఇచ్చేందుకు సెక్స్ వర్కర్లను ఎలాంటి దృవీకరణ పత్రాలు అడగాల్సిన అవసరం లేదని,. ఎలాంటి పత్రాలు లేకున్నా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆధార్ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలని, వాళ్లకు రేషన్ అందేలా చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Supreme Court

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు