హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Sedition Law: సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు.. రాజద్రోహ చట్టం నిలిపివేత.. మోదీ సర్కార్ యూటర్న్‌తో..

Sedition Law: సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు.. రాజద్రోహ చట్టం నిలిపివేత.. మోదీ సర్కార్ యూటర్న్‌తో..

రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు

రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు

రాజద్రోహం లేదా దేశద్రోహం చట్టాన్ని సుప్రీంకోర్టు నిలిపేసింది. రాజద్రోహం కేసుగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 124ఏ ఇకపై చెల్లుబాటు కాబోదని, ఈ సెక్షన్ కింద కొత్తగా కేసులు నమోదు చేయడానికి వీల్లేదని సీజేఐ రమణ ధర్మాసనం బుధవారం నాడు ఉత్తర్వులిచ్చింది. వివరాలివే..

ఇంకా చదవండి ...

భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) ఇవాళ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పదంగా మారిన రాజద్రోహం లేదా దేశద్రోహం చట్టాన్ని (Sedition Law) సుప్రీంకోర్టు నిలిపేసింది. రాజద్రోహం కేసుగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 124ఏ ఇకపై చెల్లుబాటు కాబోదని, ఈ సెక్షన్ కింద కొత్తగా కేసులు నమోదు చేయడానికి వీల్లేదని సీజేఐ రమణ ధర్మాసనం బుధవారం నాడు ఉత్తర్వులిచ్చింది.

రాజద్రోహం చట్టంపై యూటర్న్ తీసుకున్న కేంద్రం.. బ్రిటిష్ కాలం నాటి సదరు చట్టాన్ని రివ్యూచేస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన దరిమిలా ఇవాళ్టి నిర్ణయం వెలువడింది. అయితే రాజద్రోహం చట్టాన్ని నిలిపేస్తూ సుప్రీం ధర్మాసనం ఇవాళ ఇచ్చిన ఆదేశాలు తాత్కాలికమైనవే. సెక్షన్ 124(ఏ) (IPC Section 124A)పై కేంద్రం పున:సమీక్ష చేసుకున్న తర్వాతే శాశ్వతమైన లేదా తుది తీర్పు వెల్లడికానుంది. వివరాలివే..

Visakhapatnam: అప్పుడే పుట్టిన శిశువును రైలు టాయిలెట్‌లో వదిలేసిన తల్లి.. చివరికి ఏమైదంటే


బ్రిటిష్ వలస పాలకుల నాటి రాజద్రోహం (ఐపీసీ సెక్షన్ 124(ఏ) చట్టంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ చట్టాన్ని పున:సమీక్ష చేస్తామని కేంద్ర హోంశాఖ చెప్పిన నేపథ్యంలో.. రివ్యూ పూర్తయ్యేదాకా ఈ చట్టం అమలుపై స్టే విధించింది. కేంద్రం రివ్యూ పూర్తయ్యేంత వరకు రాజద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయరాదని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. అదే సమయంలో.. ఇప్పటిదాకా రాజద్రోహం కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు బెయిళ్ల కోసం ఆయా కోర్టులను ఆశ్రయించవచ్చనీ సీజేఐ ధర్మాసనం పేర్కొంది.

Narayana | Paper Leak : జగన్ సర్కారుకు భారీ షాక్.. ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్.. జడ్జి సంచలన ఆదేశాలు


భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 124ఏ యథేచ్ఛగా దుర్వినియోగమవుతోందని కేంద్ర, రాష్ట్రాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న క్రమంలో పలువురు బాదితులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్నది. అప్పటిదాకా చట్టాన్ని సమర్థిస్తూ వచ్చిన కేంద్రం.. మొన్న సోమవారం నాడు యూటర్న్ తీసుకొని, రాజద్రోహం చట్టాన్ని పున:సమీక్ష చేస్తామని కోర్టుకు తెలిపింది. ఆ మేరకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అఫిడవిట్ దాఖలు చేశారు.

Sri Lanka Crisis: శ్రీలంకలో అరాచకత్వం.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు.. పారిపోయిన రాజపక్స కుటుంబం


రాజద్రోహం చట్టాన్ని రివ్యూ చేస్తామని కేంద్రమే చెప్పడంతో.. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రస్తుతం నమోదైన రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తోందా? లేదా? తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. అందుకు 24 గంటల గడువిచ్చింది. బుధవారంతో గడువు ముగియడంతో రాజద్రోహం చట్టాన్ని తాత్కాలికంగా నిలిపేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది.

Wedding mix-up: ఏం జాతిరత్నాలురా మీరు! -ది గ్రేట్ ఇండియన్ గందరగోళం పెళ్లి -ట్విస్టులు భరించలేం..


కాగా, విచారణ సందర్భంగా కేంద్రం తరఫు న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక ప్రతిపాదనలు చేశారు. రాజద్రోహం చట్టాన్ని పూర్తిగా తొలగిచాలన్నది కేంద్రం అభిమతం కాదని ఆయన పేర్కొన్నారు. దేశద్రోహ చట్టం ప్రయోగానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడుతూ, ఇది గుర్తించదగిన నేరమని , పెండింగ్‌లో ఉన్న ప్రతి నేరం తీవ్రత తమకు తెలియదన్నారు. ఉగ్రవాదం, మనీలాండరింగ్ లేదా మరేదైనా నేరం ఉండవచ్చని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితులు బెయిల్ దరఖాస్తు చేసుకున్నప్పుడు కోర్టు ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉందని, కానీ పూర్తిగా సెక్షన్ 124ఏను నిలిపివేయడం సరికాదని మెహతా అన్నారు. అయితే, విస్తృతకోణంలో తాను నిర్ణయం తీసుకుంటామంటూ కేంద్ర వాదనను సీజేఐ బెంచ్ తోసిపుచ్చింది.

Sedition Law: రాజద్రోహం కేసులపై 24గంటల్లో తేల్చండి: సుప్రీం డెడ్‌లైన్ -మోదీ సర్కార్ యూ-టర్న్‌తో సీన్ ఇలా..


నిజానికి మోదీ సర్కారు తన ప్రత్యర్థులపై విచ్చలవిడిగా దేశద్రోహం కేసులు పెట్టిందనే ఆరోపణలున్నాయి. తర్వాతి కాలంలో బీజేపీయేతర రాష్ట్రాల్లోనూ రాజకీయ కక్షసాధింపు చర్యలకు రాజద్రోహం చట్టాన్ని ఆయా ప్రభుత్వాలు అతిగా వాడుకుంటోన్నట్లు విమర్శలు వచ్చాయి. రాజద్రోహ చట్టంపై కేంద్రం యూటర్న్ తీసుకుంటూ, ఐపీసీలోని 124ఏ సెక్షన్‌ను కొనసాగించడంపై పునరాలోచించాలని నిర్ణయించడం, ఆ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేయడంతో సుప్రీం తాజా ఆదేశాలు వెలువడ్డాయి.

CM KCR | Centre: కేసీఆర్ సర్కారుకు భారీ షాక్.. అప్పులు నిలిపేసిన కేంద్రం.. సంక్షేమ పథకాలకు దెబ్బ!


దేశద్రోహం కేసులపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు.. జైళ్లలో మగ్గుతోన్న జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి నేతలకు ఊరటనివ్వనుంది. అలాగే, మహారాష్ట్ర అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు, ఆంధ్రప్రదేశ్‌ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు తదితర రాజకీయ నేతలకూ  ఉపశమనం కానుంది.

First published:

Tags: Centre government, NV Ramana, Supreme Court, Union government

ఉత్తమ కథలు