Home /News /national /

SUPREME COURT PROPOSES TO IMPLEMENT WELFARE SCHEMES FOR ALL COVID ORPHANS GH SK

Corpus to Orphans: కరోనాతో అనాథలైన పిల్లలందరికీ పథకాలు వర్తింపజేయాలి: సుప్రీంకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలో గత సంవత్సరం మార్చి తర్వాత నుంచి అనాథలుగా మారిన పిల్లలందరికీ పీఎం-కేర్స్ కార్పస్​ ఫండ్ పథకాన్ని అమలు చేయాలని కేంద్రానికి సుప్రీం చెప్పింది. మహమ్మారి సమయంలో వైరస్ వల్లే కాకుండా వివిధ కారణాల వల్ల అనాథలైన పిల్లలకు పథకాన్ని వర్తింపజేయాలని అభిప్రాయపడింది.

ఇంకా చదవండి ...
కరోనా వైరస్ మన దేశంలో సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. లక్షలాది మందిని బలి తీసుకుంది. ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదం నింపింది. ముఖ్యంగా ఈ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక్కసారిగా కన్నవారు దూరమవడంతో వారు అనాథలుగా మారిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. అయితే కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు పీఎం-కేర్స్ నిధుల నుంచి సాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాళ్లకు 23 ఏళ్ల వయసు నిండేలోపు రూ.10 లక్షల కార్పస్ ఫండ్​ను అందిస్తామని ఓ సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. అయితే కరోనా వైరస్ సోకినందు వల్లే కాకుండా ఈ మహమ్మారి సమయంలో వల్ల వివిధ సమస్యలతో చనిపోయిన వారు ఉన్నారు. ఇలా కూడా కొందరు పిల్లలు అనాథలయ్యారు. ఇలాంటి పిల్లలకు కూడా ఆర్థిక సాయం చేసి.. పీఎం-కేర్స్​ నిధుల పథకాన్ని అమలు చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. వారిని కూడా ఆదుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రతిపాదించింది.

దేశంలో గత సంవత్సరం మార్చి తర్వాత నుంచి అనాథలుగా మారిన పిల్లలందరికీ పీఎం-కేర్స్ కార్పస్​ ఫండ్ పథకాన్ని అమలు చేయాలని కేంద్రానికి సుప్రీం చెప్పింది. మహమ్మారి సమయంలో వైరస్ వల్లే కాకుండా వివిధ కారణాల వల్ల అనాథలైన పిల్లలకు పథకాన్ని వర్తింపజేయాలని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని సుమోటాగా స్వీకరించిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ అనిరుధ్ బోస్​తో కూడిన ధర్మాసనం కేంద్రానికి ఈ సూచనలు చేసింది.

అనాథలైన పిల్లలలు తక్షణమే ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ధర్మాసనం చెప్పింది. “కరోనా కాలంలో వైరస్ వల్లనే కాకుండా వివిధ కారణాలతో అనాథలైన పిల్లలకు కూడా పథకం ప్రయోజనాలు అందాలని ప్రతిపాదిస్తున్నాం” అని సుప్రీం బెంచ్ చెప్పింది.

కాగా కరోనా సోకి తల్లిదండ్రులిద్దరూ.. లేదా ఉన్న ఏకైక పేరెంట్​, లీగల్​ గార్డియన్ మృతి చెంది అనాథలైన పిల్లలకే పీఎం-కేర్స్ స్కీమ్​ కవర్ వరిస్తుందని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్​ ఐశ్వర్య భారత్ చెప్పారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలించిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం.. కేంద్రానికి ఈ సూచనలు చేసింది. కరోనా మహమ్మారి సమయంలో పిల్లల సంరక్షణ అంశంపై కేసును సుమోటోగా స్వీకరించింది. మార్చి 2020 తర్వాత అనాథలైన పిల్లలందరికీ పథకం అందేలా చూడాలని ప్రతిపాదనలు చేసింది. పిల్లల హక్కులను అందరూ పరిరక్షించాలని, అనాథలైన చిన్నారులను దేశం బాధ్యత అని అభిప్రాయపడింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Coronavirus, Covid-19, Supreme Court

తదుపరి వార్తలు