నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో మహిళలో ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడే ఎన్డీయే ప్రవేశాలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్, రిషికేశ్ రాయ్ నేతృత్వంలోని డివిజనల్ బెంచ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచసింది. ఎన్డీయే పరీక్షకు మహిళలను అనుమతించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విధాన నిర్ణయం ప్రకారమే మహిళలను ఎన్డీయే పరీక్షకు అనుమతించలేదని ఇండియన్ ఆర్మీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఐతే లింగ వివక్ష ఆధారంగా విధానపరమైన నిర్ణయం ఉందని.. ఇది సరికాదని కోర్టు అక్షింతలు వేసింది. కాగా, సెప్టెంబరు 5న ఎన్డీయే పరీక్ష జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్డీయే పరీక్షకు మహిళలను అనుమతిస్తూ ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Supreme Court orders allowing women to take the National Defence Academy (NDA) exam scheduled for September 5th. The Apex Court says that admissions will be subject to the final orders of the court pic.twitter.com/8YVgaxz5O8
— ANI (@ANI) August 18, 2021
ఎన్డీయే పరీక్షలకు మహిళలకు అనుమతించాలని కోరుతూ కుష్ కర్లా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మహిళలను ఎన్డీయే పరీక్షకు అనుమతించకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 19ని ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకొని సాయుధ బలగాల్లో చేరి.. దేశానికి సేవ చేయాలని ఎంతో మంది అర్హత కలిగిన, ఔత్సాహిక మహిళలు భావిస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు. కానీ లింగ వివక్షతో వారి హక్కులను కాల రాస్తున్నారని పిటిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులను కల్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు సెప్టెంబరు 5న జరగబోయే ఎన్డీయే పరీక్షకు మహిళలను కూడా అనుమతించాని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి:
NEET 2021: నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? కొత్త ప్యాటర్న్ క్రాక్ చేసేందుకు ఈ టిప్స్
Constable Jobs: మొత్తం 25,271 కానిస్టేబుల్ జాబ్స్... ఏం చదవాలంటే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Army, NDA, Supreme Court