స్కూళ్లకు సెలవులు.. ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత

ఢిల్లీలోని పాఠశాలలకు నవంబరు 15 వరకు సెలవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్యానెల్ EPCA (వాతావరణ కాలుష్య నివారణ మరియు నియంత్రణ మండలి) ఆదేశించింది. అంతేకాదు హాట్ మిక్స్ ప్లాట్స్, స్టోన్ క్రషర్స్‌పై ఉన్న నిషేధాన్ని మరో రెండు రోజులు పొడిగించింది.

news18-telugu
Updated: November 13, 2019, 9:12 PM IST
స్కూళ్లకు సెలవులు.. ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి క్షీణించింది. ఎమర్జెన్సీ విధించే పరిస్థితికి గాలి కాలుష్య స్థాయి దాదాపుగా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పాఠశాలలకు నవంబరు 15 వరకు సెలవులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్యానెల్ EPCA (వాతావరణ కాలుష్య నివారణ మరియు నియంత్రణ మండలి) ఆదేశించింది. అంతేకాదు హాట్ మిక్స్ ప్లాట్స్, స్టోన్ క్రషర్స్‌పై ఉన్న నిషేధాన్ని మరో రెండు రోజులు పొడిగించింది. అత్యవసరమైతే తప్ప ఢిల్లీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అడ్వైజరీ జారీ చేసింది. ఢిల్లీతో పాటు NCR పరిధిలోని నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ నగరాలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
First published: November 13, 2019, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading