MadhyaPradesh | రేపు మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం బలపరీక్ష...

Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

news18-telugu
Updated: March 19, 2020, 7:07 PM IST
MadhyaPradesh | రేపు మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం బలపరీక్ష...
కమల్‌నాథ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
Madhya Pradesh Floor Test | మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమల్ నాథ్ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న జ్యోతిరాదిత్య సింధియ ా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తింది. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి సింధియా వెంట నడిచారు. దీంతో కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ క్రమంలో బలపరీక్ష నిర్వహించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. గవర్నర్ కూడా స్పీకర్‌కు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. అయితే, ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. రేపు విశ్వాస పరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు కమల్ నాథ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు బెంగళూరులో రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్ట్ వద్ద హైడ్రామా నడిచింది. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, మరికొందరు నేతలు రమడ రిసార్ట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త నెలకొంది. తాను రాజ్యసభ అభ్యర్థిగా తమ ఎమ్మెల్యేల ఓట్లు అడిగేందుకు వెళ్తున్నానని, తనను ఎలా అడ్డుకుంటారంటూ దిగ్విజయ్ కర్ణాటక పోలీసులను ప్రశ్నించారు. సుమారు గంటన్నరపాటు పోలీసులు, కాంగ్రెస్‌ నేతలకు మధ్య వాగ్వాదం కొనసాగింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వదిలే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి దిగ్విజయ్‌సింగ్‌ నిరసన చేపట్టారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: March 19, 2020, 6:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading