హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఆ పథకం వెంటనే అమలు చేయండి.. మమతా సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు

ఆ పథకం వెంటనే అమలు చేయండి.. మమతా సర్కార్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు

5. చనిపోయిన హిందూ పురుష వ్య‌క్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం తెలిపింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

5. చనిపోయిన హిందూ పురుష వ్య‌క్తి సోదరుల కుమారులు, కుమార్తెల కంటే అతని సొంత కుమార్తెలకే ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీం తెలిపింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

పశ్చిమ బెంగాల్ సర్కార్‌కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని అమలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ సర్కార్‌ను ఆదేశించింది.

  పశ్చిమ బెంగాల్ సర్కార్‌కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో తక్షణమే ‘వన్ నేషన్- వన్ రేషన్ కార్డు’ పథకాన్ని అమలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ సర్కార్‌ను ఆదేశించింది. ఎలాంటి కారణాలు చూపకుండా.. బెంగాల్‌లో వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని పేర్కొంది. ‘మీరు సమస్యను ఉదహరించకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. ఇది వలస కార్మికుల కోసం" అని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇక, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన్ నేషన్-వన్ రేషన్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డుదారులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకొవచ్చు.

  అయితే ఈ పథకంపై పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బియ్యం, పప్పుధాన్యాలు వంటి రాయితీతో కూడి ఆహార పదార్థాలు.. వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులకు రేషన్ కార్డు లేకపోయినా 2021 మే వరకు లభిస్తాయని చెప్పారు. మరోవైపు రాజకీయ కారణాల రీత్యా సీఎం మమత బెంగాల్‌లో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Mamata Banerjee, Supreme Court, West Bengal

  ఉత్తమ కథలు