లాలూ తనయుడికి సుప్రీంకోర్టు షాక్... బంగ్లా ఖాళీ చేసి రూ. 50 వేలు ఫైన్ కట్టాలని ఆదేశం

ప్రస్తుతం ఉంటున్న బంగ్లాను ఖాళీ చేసి ప్రతిపక్ష నాయకుడి కోసం కేటాయించిన బంగ్లాలోకి మారాలని బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ఆదేశించింది. పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసి తమ సమయాన్ని వృధా చేసినందుకు తేజస్వి యాదవ్‌కు రూ. 50 వేల జరిమానా విధించింది.

news18-telugu
Updated: February 8, 2019, 3:14 PM IST
లాలూ తనయుడికి సుప్రీంకోర్టు షాక్... బంగ్లా ఖాళీ చేసి రూ. 50 వేలు ఫైన్ కట్టాలని ఆదేశం
సోదరుడు తేజస్వితో తేజ్ ప్రతాప్ (ఫైల్ ఫోటో)
  • Share this:
తనను అధికారిక బంగ్లా ఖాళీ చేయాలంటూ పాట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వెంటనే ప్రస్తుతం ఉంటున్న బంగ్లాను ఖాళీ చేసి ప్రతిపక్ష నాయకుడి కోసం కేటాయించిన బంగ్లాలోకి మారాలని తేజస్వి యాదవ్‌ను ఆదేశించింది. అంతేకాదు పాట్నా హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేసినందుకు తేజస్వి యాదవ్‌కు రూ. 50 వేల జరిమానా విధించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.

ప్రస్తుతం తాను ఉంటున్న డిప్యూటీ సీఎం బంగ్లా నుంచి విపక్ష నేత బంగ్లాకు మారిపోవాలని పాట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి 7న తేజస్వి యాదవ్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చిన పాట్నా హైకోర్టు... ఆయనను డిప్యూటీ సీఎం కోసం కేటాయించిన భవనాన్ని కేటాయించాల్సిందే స్పష్టం చేసింది. తేజస్వి యాదవ్‌కు మంత్రి హోదాతో కూడిన బంగ్లాను ప్రభుత్వం కేటాయించిందని... అది తనకు ఇష్టంలేదనే కారణంగా అభ్యంతరం చెప్పడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2015లో ఈ బంగ్లాను అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్‌కు నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం కేటాయించింది. ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ నివాసంలోకి మారి... తన నివాసాన్ని ఆయనకు కేటాయించాలని బీహార్ ప్రభుత్వం గతంలోనే తేజస్వి యాదవ్‌కు సూచించింది.


First published: February 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు