Home /News /national /

SUPREME COURT ORDERED KERALA GOVERNMENT TO PROVIDE SECURITY FOR TWO WOMEN ENTERED SABARIMALA SHRINE AK

శబరిమల వివాదం... ఆ ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించాలన్న సుప్రీంకోర్టు

అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు

అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు

శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    శబరిమల ఆలయంలోని ప్రవేశించిన ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందులకు కేరళ ప్రభుత్వం రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమకు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ ఇద్దరు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... వారిద్దరికి తగిన భద్రత కల్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    జనవరి 2న బిందు, కనకదుర్గ శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకోవడం సంచలనం సృష్టించింది. దీనిపై హిందూ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఆలయంలోని వెళ్లిన వారిపై దాడి చేస్తామని కొందరు ప్రకటించడంతో ఇద్దరు మహిళలు కొన్ని రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోయారు. అయితే మంగళవారం అత్తింటికి వచ్చిన కనకదుర్గపై ఆమె అత్త దాడి చేయడం కలకలం రేపింది. ఈ దాడిలో గాయపడిన కనకదుర్గను ఆస్పత్రికి తరలించారు. తమపై మరోసారి దాడి జరిగే అవకాశం ఉందని భావిస్తున్న ఇద్దరి మహిళలు... తమకు భద్రత కల్పించేలా ప్రభుత్వాలను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
    First published:

    Tags: Kerala, Sabarimala Temple, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు