హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Supreme Court: కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు..నోట్ల రద్దే కారణం

Supreme Court: కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు..నోట్ల రద్దే కారణం

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

2016 నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. నోట్ల రద్దు విషయాన్ని పరిశీలించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రం, RBI (Reserve Bank Of India)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు  (Supreme Court) నోటీసులు జారీ చేసింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

2016 నోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం యొక్క విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్షలో ఉన్న 'లక్ష్మణ రేఖ' గురించి తమకు తెలుసని, అయితే ఈ నిర్ణయం ప్రస్తుతం అప్రస్తుత అంశంగా మారిందా లేదా అనే విషయాన్ని నిర్ణయించడానికి నోట్ల రద్దు విషయాన్ని పరిశీలించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రం, RBI (Reserve Bank Of India)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు  (Supreme Court) నోటీసులు జారీ చేసింది.  అంతేకాదు దీనిపై సమగ్ర అఫిడవిట్లు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Railway Employees: రైల్వే ఉద్యోగులకు శుభవార్త..దీపావళి కానుకగా భారీ బోనస్ ప్రకటన

 నోట్ల రద్దు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మసనం ఈ కింది విధంగా పేర్కొంది. రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఏదైనా సమస్య వస్తే దానికి సరైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. దీనిపై ఇరుపక్షాలు అంగీకారానికి రావాలి. కానీ అలా జరగడం లేదు కాబట్టి ఈ అంశాన్ని పరిశీలించాలి. మాకు లక్ష్మణ రేఖ ఎక్కడ ఉంటుందో తెలుసు కానీ ఇది ఎలా చేశారనేది పరిశీలించాలి. ఈ సమస్య అప్రస్తుతంగా మారిందా న్యాయసమీక్ష పరిధిలో లేదా అనే అంశాలను సమీక్షించాలి. అలాగే న్యాయవాదుల వాదనలు వినాలని ధర్మాసనం పేర్కొంది.

కేంద్రం తరపున హాజరైన సొలిసిటల్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ..అప్రస్తుత సమస్యలపై కోర్టు సమయాన్ని వృథా చేయరాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ వివేక్ నారాయణ్ శర్మ తరపున సీనియర్ న్యాయవాది ఈ కేసులను రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంచాలని పేర్కొన్నారు. ధర్మసనం సమయం వృథా అనే పదాలు తనను ఆశ్చర్యపరిచాయని సీనియర్ న్యాయవాది అన్నారు. మరో సీనియర్ న్యాయవాది చిదంబరం మాట్లాడుతూ..ఈ సమస్య అకడమిక్ గా మారలేదని, ఈ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించాలని అన్నారు.

First published:

Tags: Delhi, Supreme Court

ఉత్తమ కథలు