ట్విటర్ ద్వంద్వం వైఖరి అవలంబిస్తోందని రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో ఒక రకంగా.. భారత్‌లో ఎర్రకోటపై దాడి ఘటనలో మరో రకంగా ఎలా స్పందిస్తారని ఆయన ట్విటర్‌ను సూటిగా ప్రశ్నించారు.
ట్విటర్లో ఫేక్‌న్యూస్‌పై తీవ్ర దుమారం రేగుతోంది. కేంద్రం, ట్విటర్ సంస్థ మధ్య వార్ ముదురుతోంది. ఈ క్రమంలో ట్విటర్‌తో పాటు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ఫేక్‌న్యూస్‌ను తనిఖీచేసి, అడ్డుకట్ట వేసే మెకానిజం ఉండేలా ఆదేశాలివ్వాలని బీజేపీకి నేత వినీత్ గోయెంగా పిల్ దాఖలు చేశారు. దానిపై సీజేఐ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సోషల్ మీడియా భారత వ్యతిరేక, విద్వేష పూరిత పోస్ట్‌లకు అడ్డుకట్ట వేయాలని పిటిషనర్ తరపు లాయర్ అశ్విని కుమార్ దుబే వాదించారు. ఆయన వాదను విన్న కోర్టు.. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచార నియంత్రణకు సంబంధించి కేంద్రంతో పాటు ట్విట్టర్‌కు నోటీసులు జారీచేసింది.
కొత్త వ్యవసాయ చట్టాలు, రైతుల ఉద్యమానికి సంబంధించి ట్విటర్లో అసత్య ప్రచారం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు ఇప్పటికే సూచించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వారి అకౌంట్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. కానీ ట్విటర్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. పూర్తి స్థాయిలలో అకౌంట్లను బ్లాక్ చేయలేదు. ఈ క్రమంలోనే ట్విటర్‌పై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేశారు. వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వారు భారత చట్టాలను గౌరవించాలని ట్విటర్‌ను హెచ్చరించారు.
గురువారం పార్లమెంట్లో ప్రశ్నోత్తర సమయంలోనూ ఈ అంశంపై రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. ట్విటర్ ద్వంద్వం వైఖరి అవలంబిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో ఒక రకంగా.. భారత్‌లో ఎర్రకోటపై దాడి ఘటనలో మరో రకంగా ఎలా స్పందిస్తారని ఆయన ట్విటర్‌ను సూటిగా ప్రశ్నించారు. క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో పోలీసులకు అండగా ఉన్నారని, విద్వేషాన్ని వెళ్లగక్కే వారి ఖాతాలను బ్లాక్ చేశారని గుర్తు చేశారు. భారత్‌లో అలా ఎందుకు చేయడం లేదని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నిస్తున్నారు. భారత చట్టాలను గౌరవించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మరోవైపు ట్విటర్, కేంద్రం మధ్య ఘర్షణ నేపథ్యంలో మనదేశంలో చాలా మంది ట్విటర్ నుంచి బయటకొస్తున్నారు. దేశీయ యాప్ 'కూ'కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, ప్రభుత్వ శాఖలు కూకు కనెక్ట్ అయ్యారు. దేశీయ యాప్ కూను వాడాలని పిలుపునిస్తున్నారు. ట్విటర్లో కాకుండా కూలోనే పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు కూడా క్యూను డౌన్లోడ్ చేస్తున్నారు. కూకు గత వారంలో 20 లక్షల యూజర్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 30 లక్షలకు చేరింది. రాబోయే రోజుల్లో భారత్‌లో ట్విటర్‌కు గడ్డు పరిస్థితి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.