రైతులపై హత్యాకాండ: దసరా తర్వాత చూద్దాం -Lakhimpur కేసులో Supreme Court -యోగి సర్కారుపై అసంతృప్తి

లఖీంపూర్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ

supreme court on lakhimpur kheri violence | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖీంపూర్ ఖేరీ హత్యాకాండపై సుప్రీంకోర్టు ఉసూరుమనిపించింది. దర్యాప్తు సాగుతోన్న తీరుపై, నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీజేఐ ధర్మాసనం.. ఆ దిశగా యూపీ ప్రభుత్వానికి ఆదేశాలేవీ జారీ చేయకుండానే కేసును సుదీర్ఘకాలానికి వాయిదా వేసింది. రైతుల హత్యోదంతాలపై దసరా సెలవుల తర్వాతే విచారించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించుకుంది..

  • Share this:
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖీంపూర్ ఖేరీ హత్యాకాండపై సుప్రీంకోర్టు ఉసూరుమనిపించింది. దర్యాప్తు సాగుతోన్న తీరుపై, నిందితులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీజేఐ ధర్మాసనం.. ఆ దిశగా యూపీ ప్రభుత్వానికి ఆదేశాలేవీ జారీ చేయకుండానే కేసును సుదీర్ఘకాలానికి వాయిదా వేసింది. రైతుల హత్యోదంతాలపై దసరా సెలవుల తర్వాతే విచారించాలని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించుకుంది..

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఈనెల 3న చోటుచేసుకున్న హింసపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేస్తున్నది. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును టేకప్ చేసింది. గురువారం నాటి బెంచ్ ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు జరుగుతోన్న తీరుపై యూపీ సర్కారు శుక్రవారం నాడు ఒక స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. సదరు రిపోర్టుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు.

లఖీంపూర్ కేసులో యూపీ సర్కారు తీసుకున్న చర్యలు, హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయకపోవడంపై యూపీ ప్రభుత్వాన్ని కోర్టు నిలదీసింది. యూపీ ప్రభుత్వం తరఫున ప్రముఖ లాయర్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. చనిపోయిన రైతుల శరీరాల్లో బుల్లెట్లు లేవని పోస్టుమార్టం నివేదికలో తేలిందని సాల్వే గుర్తుచేశారు. ఆశిష్ మిశ్రా శనివారం నాడు పోలీసుల విచారణకు హాజరవుతారని సాల్వే కోర్టుకు తెలిపారు.

ఆశిష్ మిశ్రాను విచారించిన తర్వాత కేసులో పోలీసులు మరింత వేగం పెంచుతారని యూపీ ప్రభుత్వం తరఫు లాయర్ హరీష్ సాల్వే హామీ ఇవ్వబోతుండగా, బెంచ్ అడ్డుపడి.. యూపీ సర్కారు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్ష్యాలను కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, స్పష్టమైన ఆదేశాలేవీ జారీ చేయకుండానే సుప్రీంకోర్టు ఈ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టుకు దసరా సెలవులు ఉన్నందున తదుపరి విచారణను 20వ తేదీకి వాయిదా వేసింది.
Published by:Madhu Kota
First published: