హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Supreme Court Live : సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం..ఈ లింక్స్ ద్వారా చూడొచ్చు

Supreme Court Live : సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం..ఈ లింక్స్ ద్వారా చూడొచ్చు

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Supreme Court Live : సుప్రీంకోర్టు(Supreme court) కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం(Live streamed) ప్రారంభమైంది. రోజువారీ కార్యకలాపాలను మంగళవారం నుంచి లైవ్​ ద్వారా ప్రసారం చేస్తోంది సర్వోన్నత న్యాయస్థానం

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Supreme Court Live : సుప్రీంకోర్టు(Supreme court) కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం(Live streamed) ప్రారంభమైంది. రోజువారీ కార్యకలాపాలను మంగళవారం నుంచి లైవ్​ ద్వారా ప్రసారం చేస్తోంది సర్వోన్నత న్యాయస్థానం. దీంతో సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. సెప్టెంబ‌ర్ 27వ తేదీ నుంచి రాజ్యాంగ ధ‌ర్మాస‌నం విచారిస్తున్న కేసుల్ని లైవ్‌లో ప్ర‌సారం చేయాల‌ని గ‌త‌వారం సుప్రీంకోర్టు నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం చేప‌ట్టిన విచార‌ణ‌ను తొలిసారి లైవ్‌లో ప్ర‌సారం చేశారు. ఈరోజు మూడు ప్రత్యేక రాజ్యంగ ధర్మాసనం కేసుల విచారణను సుప్రీంకోర్టు లైవ్ ఇష్తోంది. ttps://main.sci.gov.in/display-board లేదా https://webcast.gov.in/scindia/ లో వేర్వేరు ధర్మాసనాల విచారణల ప్రత్యక్ష ప్రసారం లింకులు అందుబాటులో ఉంటాయి. ఈడబ్ల్యూఎస్​ కోటా, ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ కేంద్రం, శివసేన వివాదం,ఆల్​ ఇండియా బార్ ఎగ్జామ్ చెల్లుబాటుపై మూడు వేర్వేరు ధర్మాసనాల విచారణల్ని ఇక్కడ చూడొచ్చు.

మహారాష్ట్ర మాజీ ఉద్దవ్ ఠాక్రే,సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన రెండు వర్గాలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రెండో రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. శివసేన పార్టీపై హక్కుకి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు ఆగస్టులో రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. పార్టీపై దావాపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరియు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే మధ్య జరిగిన పోరులో పెద్ద బెంచ్ నిర్ణయం తీసుకోవడానికి ఫిరాయింపు, విలీనం, అనర్హతకు సంబంధించిన ఎనిమిది ప్రశ్నలను రాజ్యాంగ ధర్మాసనం రూపొందించింది.

Viral Photo : శవపేటిక టైప్ లో ఆఫీసులో కుర్చీలు..వర్క్ చేస్తూ చనిపోతే మూసేసి తీసుకెళ్లడమే

వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు 2018లోనే అనుమతి లభించింది. రాజ్యాంగం, జాతీయ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చే కొన్ని కేసుల ప్రత్యక్ష ప్రసారానికి అంగీకారం తెలిపింది సుప్రీంకోర్టు. జస్టిస్‌ ఎన్​వీ రమణ 2021 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. లైవ్​ విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయ సాధనకు కృషి చేశారు. సీజేఐ యూయూ ల‌లిత్ నేతృత్వంలో గ‌త‌వారం ఏక‌గ్రీవం నిర్ణ‌యం తీసుకున్నారు. కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యూయూ లలిత్​ నేతృత్వంలో గత మంగళవారం జరిగిన ఫుల్​ కోర్ట్ సమావేశంలో నిర్ణయించారు. లైవ్​ ఇచ్చేందుకు న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. దాని ప్ర‌కార‌మే యూట్యూబ్‌లో సుప్రీం విచార‌ణ‌ను ప్ర‌సారం చేస్తున్నారు. కాగా,ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసుల్ని మాత్రమే యూట్యూబ్​లో చూసే వీలు కల్పించిన సుప్రీంకోర్టు త్వరలోనే ఇందుకోసం సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది

Published by:Venkaiah Naidu
First published:

Tags: Supreme Court

ఉత్తమ కథలు