Home /News /national /

SUPREME COURT LATEST ORDERS REGARDING COVID 19 DEATH COMPENSATION ISSUE AK

Covid-19 Deaths Compensation: కరోనా మృతులకు పరిహారం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Covid 19 Death Compensation: కరోనా మరణాల విషయంలో నకిలీ క్లయిమ్‌ల అంశంపై కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

    కరోనా మరణాల విషయంలో పరిహారం కోసం క్లయిమ్‌ దాఖలు చేయడానికి గడువును కేంద్రం నిర్ణయించింది. తాజా ఆదేశాల ప్రకారం.. మార్చి 20 కంటే ముందు సంభవించిన కరోనా మరణాలకు 60 రోజుల్లోపు క్లయిమ్‌లు(Compensation) దాఖలు చేయాలని సూచిచింది. భవిష్యత్తులో ఏదైనా మరణానికి క్లయిమ్ ఫైల్ చేయడానికి 90 రోజుల సమయం ఇచ్చింది. ఈ అంశం నాలుగు వారాల గడువు సరిపోదని సుప్రీంకోర్టు(Supreme Court) గత నెలలో పేర్కొంది. కరోనా కారణంగా బంధువులు మరణించినప్పుడు చెల్లించే పరిహారం సమయాన్ని కేంద్రం నిర్ణయించింది. మృతుడి బంధువులు విషాదంలో ఉంటారని.. అందుకే ఇంత సమయం సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన ధర్మాసనం పరిహారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులైన వారందరికీ 60 రోజుల గడువు ఇవ్వబడుతుందని సూచించింది.

    భవిష్యత్ అభ్యర్థులకు 90 రోజుల సమయం ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది. కరోనాతో మరణించిన వారి విషయంలో వారి కుటుంబం షాక్‌లో ఉండవచ్చని.. కాబట్టి క్లయిమ్ దాఖలుకు నాలుగు వారాలు మంచి సమయం సరిపోకపోవచ్చని సూచించింది. కరోనా మరణం (Covid 19 Death)సంభవించిన సమయంలో ఆ కుటుంబం దుఃఖం నుండి కోలుకోవడానికి, మళ్లీ దావా వేయడానికి సమయం కావాలని కోర్టు పేర్కొంది.

    ఇదే సమయంలో కరోనా మరణాల విషయంలో నకిలీ క్లయిమ్‌ల అంశంపై కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఈ అంశంలో నకిలీ క్లయిమ్ దాఖలు చేస్తే.. వారు కూడా శిక్షార్హులే అని కోర్టు స్పష్టం చేసింది. క్లయిం చేసిన వారిలో 5 శాతం మందిని యాదృచ్ఛికంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపింది. ఒకవేళ అలాంటి కేసు నకిలీది అని తేలితే.. శిక్ష పడుతుందని స్పష్టం చేసింది.

    Zero Cases: రెండేళ్లలో తొలిసారి...భారత్ లోని ఆ రాష్ట్రంలో ఒక్క కోవిడ్ కేసు కూడా లేదు

    Mayawati : మీ పార్టీ సంగతి చూసుకో ఫస్ట్..రాహుల్ విమర్శలకు మాయావతి స్ట్రాంగ్ కౌంటర్

    మోసపూరిత క్లయిమ్‌ల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ చర్య తీసుకోబడుతుందని వెల్లడించింది. కోవిడ్‌-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా అందజేయాలన్న తప్పుడు వాదనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఈ పరిహారం దుర్వినియోగం అవుతుందని తామెప్పుడూ ఊహించలేదని పేర్కొంది. నైతికత స్థాయి ఇంత దిగజారదని భావిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Covid-19, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు