వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

గతంలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క ఈవీఎం మాత్రమే లెక్కించే వారు. ఇప్పుడు ఐదింటిని లెక్కించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది.

news18-telugu
Updated: April 8, 2019, 12:59 PM IST
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి ఐదు ఈవీఎంలను లెక్కించాలని ఆదేశించింది. గతంలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్క ఈవీఎం మాత్రమే లెక్కించే వారు. ఇప్పుడు ఐదింటిని లెక్కించాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ‘అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వీవీప్యాట్ యంత్రంలో స్లిప్పులను లెక్కించే ప్రక్రియను ఐదింటికి పెంచడం ద్వారా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరింత పారదర్శకత వస్తుంది. ఎన్నికల ప్రక్రియ మీద రాజకీయ పార్టీలతో పాటు పేదలు కూడా సంతృప్తి చెందుతారు.’ అని సీజేఐ రంజన్ గొగోయ్ తెలిపారు.ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ యంత్రంలోని స్లిప్పులను కూడా లెక్కించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు వివరణ కోరింది. అయితే, ప్రతి ఈవీఎంతోపాటు అన్ని వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను కూడా లెక్కిస్తే దాని వల్ల కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుందని, ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి ఆరు రోజులు పడుతుందని ఈసీ కోర్టుకు తెలిపింది. దీనిపై చంద్రబాబునాయుడు కౌంటర్ దాఖలు చేశారు. ఎన్నికల విధుల్లో సిబ్బందిని పెంచడం ద్వారా ఆలస్యం అవుతుందనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను లెక్కించడం ద్వారా ప్రజల్లో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. రెండు వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక వీవీప్యాట్ యంత్రంలోని స్లిప్పులను లెక్కిస్తున్నారు. దాన్ని ఐదింటికి పెంచింది.
First published: April 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading