హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అయోధ్య తీర్పు... మధ్యవర్తుల బృందాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు

అయోధ్య తీర్పు... మధ్యవర్తుల బృందాన్ని ప్రశంసించిన సుప్రీంకోర్టు

అయోధ్య సమస్య పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తుల బృందం సభ్యులు(ఫైల్ ఫోటో)

అయోధ్య సమస్య పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తుల బృందం సభ్యులు(ఫైల్ ఫోటో)

అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని సుప్రీంకోర్టు అభినందించింది.

అయోధ్య వివాదానికి సంబంధించి కీలక తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు... ఈ క్రమంలో సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన మధ్యవర్తుల కమిటీని కూడా ప్రశంసించింది. అయోధ్య రామ జన్మభూమి - బాబ్రీ మసీదు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన ముగ్గురు మధ్యవర్తుల బృందాన్ని సుప్రీంకోర్టు అభినందించింది. అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారానికి దగ్గరగా వచ్చారంటూ కితాబిచ్చింది. అయోధ్య వివాదంపై రాజీ కోసం జస్టిస్ కలీఫుల్లా, శ్రీరాం పంచు, శ్రీశ్రీ రవిశంకర్‌లను సుప్రీంకోర్టు మధ్యవర్తులుగా గతంలో సుప్రీంకోర్టు నియమించింది.

ఈ బృందం కేసుకు సంబంధించిన కక్షిదారులతో చర్చలు జరిపినా... సమస్యకు పరిష్కారం కనుగొలేకపోయింది. అయితే సమస్య పరిష్కారం కోసం వీరి చేసిన కృషిని సుప్రీంకోర్టు అభినందించింది. ఇక అన్ని విశ్వాసాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ సుప్రీంకోర్టు ఇవాళ చారిత్రక తీర్పు వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని పేర్కొంది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయించింది.

First published:

Tags: Ayodhya Dispute, Ayodhya Ram Mandir, Ayodhya Verdict

ఉత్తమ కథలు