గత 20 సంవత్సరాలుగా ఉజ్జయినీ వినోద్ మిల్స్ మూతపడివున్న విషయం తెలిసిందే. దీంతో అంతకు ముందు.. అదే మిల్లులో పనిచేస్తున్న నాలుగున్నర వేలమంది కార్మికులు నిరుద్యోగులుగా మారిపోయారు. అయితే తాజాగా..మూతపడివున్న ఉజ్జయినీ వినోద్ మిల్స్ పై సుప్రీంకోర్ట్..ఓ తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం..మూత పడిన కాలం నుండి ఇప్పటి వరకు అందులో పనిచేస్తున్న వారికి జీతాలు చెల్లించాలనీ ఈ తీర్పు సారాంశం. దీంతో శ్రామీకుల ముఖంలో ఆనందాలు వెల్లు విరుస్తున్నాయి. ఇప్పటికైనా న్యాయం జరిగిందని..సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సుప్రీంకోర్ట్ తన తాజా తీర్పులో మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ..కార్మికులకు గత ఇరవై సంవత్సరాలుగా..పెండింగ్లో జీతాలను చెల్లించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వంపై భారం రూ.. 58 కోట్లు పడనుంది. అంతేకాకుండా.. 1991 నుండి 1996 వరకు మరో 4 వేల మందికి కూడా వేతనాలు చెల్లించలేదు..ఈ తాజా తీర్పులో వారికి కూడా చెల్లించాలని కోర్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కేథరిన్ థ్రెసా లేటెస్ట్ ఫోటోషూట్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, National News, Supreme Court