హోమ్ /వార్తలు /జాతీయం /

సుప్రీంకోర్టులో కొత్తగా మరో నలుగురు న్యాయమూర్తులు..

సుప్రీంకోర్టులో కొత్తగా మరో నలుగురు న్యాయమూర్తులు..

సుప్రీంకోర్టు (File)

సుప్రీంకోర్టు (File)

Supreme Court New Judges : కొత్తగా నలుగురి చేరికతో సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నందునా.. సత్వర న్యాయ విచారణ కోసం న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిందిగా నిర్ణయించింది.

ఇంకా చదవండి ...

సుప్రీంకోర్టులో కొత్తగా మరో నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయే నేత్రుత్వంలోని కొలీజియం సూచన మేరకు కేంద్ర న్యాయశాఖ వారి పేర్లను ఖరారు చేసింది. వీరిలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం, పంజాబ్&హర్యానా చీఫ్ జస్టిస్ కృష్ణ మురారి,రాజస్తాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.రవీంద్ర భట్,కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ హృశికేష్ రాయ్ ఉన్నారు.


కొత్తగా నలుగురి చేరికతో సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నందునా.. సత్వర న్యాయ విచారణ కోసం న్యాయస్థానం న్యాయమూర్తుల సంఖ్యను పెంచాల్సిందిగా నిర్ణయించింది. ఇందులో భాగంగానే తాజా నియామకాలను చేపట్టింది. కేంద్రం ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం సుప్రీంలో 59వేల పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


First published:

Tags: Bjp, Delhi, Supreme Court

ఉత్తమ కథలు