హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

దిశ కేసులో కీలక పరిణామం... పోలీసులకు ఊరట

దిశ కేసులో కీలక పరిణామం... పోలీసులకు ఊరట

సుప్రీంకోర్టు (File)

సుప్రీంకోర్టు (File)

దిశ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయడంతో పాటు తమకు రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలన్న బాధితుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, బీఆర్ గవాయ్, సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పరిహారం సహా ఇతర అంశాలను ఈ కేసుకు సంబంధించి కోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ దృష్టికి తీసుకురావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్‌కర్ నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో వీఎన్ రేఖ, సీబీఐ మాజీ అధికారి కార్తికేయన్ సభ్యులుగా నియమించింది. ఆరు నెలల్లో దీనిపై విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఈ కమిషన్‌కు స్పష్టం చేసింది. వీరికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కమిషన్ చేపట్టబోయే విచారణ వివరాలను మీడియాకు లీక్ కాకుండా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన జరుగుతున్న అన్ని రకాల దర్యాప్తులను ఆపాలని... ఈ కమిషన్ దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని ఆదేశించింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి తమకు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.

First published:

Tags: Disha, Disha accused Encounter, Hyderabad police, Supreme Court, Telangana

ఉత్తమ కథలు