అయోధ్య కేసు రివ్యూ పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పును పున:సమీక్షించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయోధ్య తీర్పుపై దాఖలైన మొత్తం 18 రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, హిందూ మహాసభ, నిర్మోహి అఖాడాతో పాటు మరో 40 మంది రివ్యూ పిటిషన్ వేశారు. ఐతే ఆ పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. నవంబరు 9న ఇచ్చిన తీర్పే ఫైనల్ అని తేల్చిచెప్పింది.
Supreme Court dismisses all the review petitions in Ayodhya case judgment. pic.twitter.com/vZ2qKdk59A
— ANI (@ANI) December 12, 2019
అయోధ్య కేసులో నవంబరు 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్కే చెందుతుందని వెల్లడించింది. మసీదుకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని కేంద్రానికి సూచించింది కోర్టు. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని జస్టిస్ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.