Home /News /national /

SUPREME COURT DISMISSED PIL AGAINST GZRRC ZOO SUPPORTED BY RELIANCE INDUSTRIES IN JAMNGAR OF GUJARAT AK

Supreme Court: ఏ ఆధారం లేదు.. జామ్‌నగర్ జూకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

GZRRC: గ్రీన్స్ జూవలాజికల్ రెస్క్యూ అండ్ రిహబిలిటేషన్ సెంటర్ సొసైటీ(GZRRC)‌కి సంబంధించిన కార్యకలాపాలు, జంతువులను బదిలీ చేయడానికి మంజూరు చేసిన అనుమతులు చట్టబద్ధమైనవి అని సుప్రీంకోర్టు పేర్కొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిలయన్స్ సహకారంతో నడుస్తున్న గ్రీన్స్ జూవలాజికల్ రెస్క్యూ అండ్ రిహబిలిటేషన్ సెంటర్ సొసైటీ(GZRRC)‌కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. GZRRCకి అనుమతులు మంజూరు చేసే అధికారులలో ఏ విధమైన బలహీనత కనిపించలేదని సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. GZRRCకి సంబంధించిన కార్యకలాపాలు, జంతువులను(Animals) బదిలీ చేయడానికి మంజూరు చేసిన అనుమతులు చట్టబద్ధమైనవి(Legal) అని పేర్కొంది. అవన్నీ సంతృప్తికరంగానే ఉన్నాయని వ్యాఖ్యానించింది. పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. GZRRCపై మోపిన ఆరోపణలు "ఏ తర్కం లేదా ఆధారం" లేవని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

    GZRRC దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. GZRRC కార్యకలాపాలు, జంతువులను బదిలీ చేయడానికి మంజూరు చేసిన అనుమతులు, దాని పర్యవసాన కార్యకలాపాలు చట్టబద్ధమైనవని అభిప్రాయపడింది. GZRRC మౌలిక సదుపాయాలు, పనితీరు, పశువైద్యులు, క్యూరేటర్లు, జీవశాస్త్రవేత్తలు, జంతుశాస్త్రజ్ఞులు, దానితో నిమగ్నమైన ఇతర నిపుణులు, సంస్థ తన కార్యకలాపాలను చట్టపరంగా ఖచ్చితంగా నిర్వహిస్తోందని GZRRC నివేదికను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు పేర్కొంది. GZRRC అనేది జంతువుల సంక్షేమం ప్రధాన లక్ష్యంతో కూడిన లాభాపేక్షలేని సంస్థ అని కూడా అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.




    ఈ క్రమంలో సమకూరిన ఏదైనా ఆదాయాన్ని GZRRC రెస్క్యూ పని కోసం మాత్రమే ఉపయోగిస్తుంది. పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి.. ఈ అంశంలో నిపుణుడు కాదని.. కేవలం వార్తా నివేదికల ఆధారంగా పిటిషన్‌ను రూపొందించారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. GZRRC గుర్తింపు పొందిన జంతుబప్రదర్శనశాల, గుర్తింపు పొందిన రెస్క్యూ సెంటర్ అని.. ఇందులో వివాదం చేయడానికి ఎటువంటి అవకాశం లేదని కోర్టు పేర్కొంది.

    Exotic Animals: ఆ జంతువుల విషయంలో మార్గదర్శకాలు అవసరమే.. కేంద్రం అడ్వైజరీకి సుప్రీంకోర్టు సమర్థన

    Dolo Tablets: డాక్టర్లకు వెయ్యి కోట్ల తాయిలాలు.. డోలో టాబ్లెట్స్‌కు డిమాండ్ వెనక అసలు కథ..!

    GZRRC తన వార్షిక నివేదిక 2020-21లో జీవవైవిధ్యం ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, తక్షణ సంరక్షణ అవసరమయ్యే జంతువులను రక్షించడం, పునరావాసం కోసం నోడల్ కేంద్రంగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. GZRRC వద్ద శాటిలైట్ రెస్క్యూ ఫెసిలిటీ హౌసింగ్ చిరు తపులులు క్వారంటైన్ ప్రాంతంతో పాటు పని చేస్తున్నాయి. మిగిలిన సౌకర్యాలను ప్లాన్ చేసి నిర్మిస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో GZRRC పేర్కొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Reliance Industries, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు