హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mukesh Ambani: ముకేశ్ అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి.. సుప్రీంకోర్టు ఆదేశం

Mukesh Ambani: ముకేశ్ అంబానీ కుటుంబానికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి.. సుప్రీంకోర్టు ఆదేశం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ (ఫైల్ ఫోటో)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ (ఫైల్ ఫోటో)

Mukesh Ambani: భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా అత్యుతన్న స్థాయి భద్రత కల్పించాలని.. ఆ ఖర్చులన్నీ అంబానీ కుటుంబమే భరిస్తుందని తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ఆయన కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముఖేష్ అంబానీ కుటుంబానికి పదే పదే బెదిరింపు కాల్స్ వస్తున్నందున.. వారికి  అత్యున్నత స్థాయి  Z+ భద్రత (Z plus security) కల్పించాలని స్పష్టం చేసింది. భారత్ ఉన్నప్పుడు మాత్రమే కాదు.. విదేశాల్లో కూడా అంబానీ కుటుంబానికి సెక్యూరిటీ ఇవ్వాలని.. మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

రాహుల్‌ గాంధీ న్యూ లుక్ అదుర్స్ .. వైరల్ అవుతన్న కాంగ్రెస్ ఎంపీ ఫోటోలు

ఒక వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పుడు.. ఆయనకు కల్పించే భద్రతను ప్రాంతానికి లేదా నగరానికి పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. అంబానీ కుటుంబానికి మహారాష్ట్రతో సహా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల్లోనూ  వ్యాపారాలు ఉన్నాయని.. అందువల్ల దేశ విదేశాల్లో ఏకరీతి, అత్యున్నత స్థాయి భద్రత అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా అత్యుతన్న స్థాయి భద్రత కల్పించాలని.. ఆ ఖర్చులన్నీ అంబానీ కుటుంబమే భరిస్తుందని తెలిపింది. ప్రతివాది నెంబర్ 2 నుంచి 6 (అంబానీలు) వరకు భద్రత కల్పించడంపై వివిధ ప్రదేశాలు, వివిధ కోర్టుల్లో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలను జారీచేసింది సుప్రీంకోర్టు.

ముకేశ్ అంబానీ కుటుంబం తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ముంబై పోలీసులు, కేంద్ర హోం వ్యవహారాల శాఖ, కేంద్ర ప్రభుత్వం.. అంబానీలకు పొంచి ఉన్న ముప్పు గురించి మదింపు చేశాయని... వారికి ముప్పు ఉన్నట్లు నిర్ధారించినందువల్లే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారని పేర్కొన్నారు. అంబానీలకు దేశవ్యాప్తంగా, విదేశాల్లో వ్యాపార సంస్థలు ఉన్నాయని, దాతృత్వ కార్యకలాపాలను కూడా నిర్వహిస్తారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచడం కోసం వీరిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల వారికి మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా రక్షణ కల్పించాలని కోరారు.

ముంబైలో అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్రం సెక్యూరిటీని కొనసాగించాలంటూ గత ఏడాది జులై 22 న సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని... దీనిపై స్పష్టత కావాలని కోరుతూ త్రిపురకు చెందిన బికాస్ సాహా అనే వ్యక్తి దాఖలు పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారించిన న్యాయస్థానం.. అంబానీ కుటుంబ సభ్యులకు ఇండియాతో పాటు విదేశల్లోనూ సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈయన వేసిన పిల్‌పై త్రిపుర హైకోర్టు మే 31 న, జూన్ 21 న రెండు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అంబానీ కుటుంబ సభ్యులకు పొంచి ఉన్న ముప్పు వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రహోంశాఖను ఆదేశించింది. త్రికోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. వారికి భద్రతను కొనసాగించాలని గతంలోనే ఆదేశాలు జారీచేసింది.

First published:

Tags: Mukesh Ambani, Reliance, Supreme Court

ఉత్తమ కథలు