హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Right to dignity : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు..కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

Right to dignity : సెక్స్ వర్కర్లకు ఆధార్ కార్డులు..కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Aadhaar Cards to Sex Workers : దేశంలోని ప్రతి వ్యక్తికి గౌరవం పొందాల్సిన ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్ సందర్భంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్న వాళ్లలో సెక్స్ వర్కర్స్ ముందు వరుసలో ఉంటారు.

Aadhaar Cards to Sex Workers : దేశంలోని సెక్స్ వర్కర్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ప్రతి వ్యక్తికి గౌరవం పొందాల్సిన ప్రాథమిక హక్కు ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోవిడ్‌ సంక్షోభం కారణంగా సెక్స్‌ వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ దాఖలైన పిటిషన్ పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భారత విశిష్ట గుర్తింపు అథారిటీ (UIDAI) జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికెట్‌ ఆధారంగా సెక్స్‌వర్కర్లకు ఆధార్‌ కార్డులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతి ఒక్కరికి సమానంగా, గౌరవంగా బతికే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆధార్ కార్డుల జారీ సమయంలో సెక్స్‌ వర్కర్ల గోప్యతను ఉల్లంఘించకూడదని, వారి గుర్తింపును బహిర్గతం చేయకూడదని జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ ఏఎస్ బొపన్న నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (ఎన్‌ఎసిఒ)లోని గెజిటెడ్‌ అధికారి లేదా రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్ర సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సమర్పించే ఎన్‌రోల్‌మెంట్‌ ఫారం ఆధారంగా యుఐడిఎఐ జారీ చేసే ప్రొఫార్మా సర్టిఫికెట్‌ ఆధారంగా సెక్స్ వర్కర్లకు ఆధార్‌ కార్డులివ్వాలని ధర్మాసనం ఆదేశించింది.  ఆధార్ కార్డులు ఇచ్చేందుకు సెక్స్ వర్కర్లను ఎలాంటి దృవీకరణ పత్రాలు అడగాల్సిన అవసరం లేదని,. ఎలాంటి పత్రాలు లేకున్నా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆధార్ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలని, వాళ్లకు రేషన్ అందేలా చూడాలని సుప్రీంకోర్టు తెలిపింది.

ALSO READ Video Viral : కాస్ట్లీ కార్లు వదిలి..చీపెస్ట్ కారులో టాటా ప్రయాణం..నెటిజన్ల ప్రశంసలు

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు సెక్స్ వర్కర్ల జాబితాను రూపొందించాలని సుప్రీం ఆదేశించింది. రేషన్ అందనివారిని సైతం గుర్తించాలని స్పష్టం చేసింది. సీబీఓ(కమ్యునిటీ బేస్డ్ ఆర్గనైజేషన్) గుర్తించిన సెక్స్ వర్కర్లకు ఓటర్ ఐడీలు సైతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సెక్స్ వర్కర్లకు రేషన్ అందించాలని ఇదివరకే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారికి ఎటువంటి గుర్తింపు కార్డులు లేదన్న కారణంతో రేషన్ పంపిణీని అడ్డుకోవద్దని సూచించింది.

ALSO READ Vastu Tips : లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి,డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఇలా చేయండి

కాగా, కరోనా వైరస్ ప్రేరేపిత లాక్ డౌన్ సందర్భంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొన్న వాళ్లలో సెక్స్ వర్కర్స్ ముందు వరుసలో ఉంటారు. కరోనా సమయంలో వీరు జీవనానికి చాలా ఇబ్బందులు పడ్డరు. దీంతో వీళ్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ వీరందరికీ అందించాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిల్ విచారణ సందర్భంగా కోర్టు తాజా సూచనలు చేసింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది లక్షల మంది మహిళా సెక్స్ వర్కర్లు, ట్రాన్స్‌జెండర్ సెక్స్ వర్కర్లకు మేలు జరగనుంది.

First published:

Tags: AADHAR, Supreme Court

ఉత్తమ కథలు