Home /News /national /

SUPREME COURT DIRECTS CENTRE TO FIND A SOLUTION TO STOP POLITICAL PARTIES FROM GIVING FREEBIES DURING ELECTIONS SK

Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పరిష్కారం చూపాలని కేంద్రానికి ఆదేశాలు

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Supreme Court: ఎన్నికల్లో ఉచిత వాగ్ధానాలు చాలా సీరియస్ అంశమని.. దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ఎందుకు ఆలోచిస్తోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై పరిష్కారం కోసం ఫైనాన్స్ ఫైనాన్స్ కమిషన్ సూచనలను కోరవచ్చో లేదో పరిశీలించాలని సూచించింది.

ఇంకా చదవండి ...
    మాకు ఓటు వేస్తే.. కరెంటు ఉచితం. ఈసారి మమ్మల్ని గెలిపిస్తే మీ పిల్లల ఫీజులు ఉచితం. నెలానెలా సరుకులను ఫ్రీగా ఇస్తాం.. బస్సుల్లో కూడా ఫ్రీగా జర్నీ చేయొచ్చు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ పేర్లు బాగా వినిపిస్తాయి. ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ.. అంటూ రాజకీయ నాయకులు ఉపన్యాసాలిస్తుంటారు. తీరా గెలిచిన తర్వాత.. కొన్నింటిని అమలు చేసి.. మిగతా వాటిని పట్టించుకోరు. ఇలాంటి ఉచిత హామీలు, పథకాలు దేశానికి మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీల ఉచిత హామీల (Freebies)ను ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం.. ఇది ఆందోళనకర అంశంగా పరిగణించింది. ఉచిత హామీలకు అడ్డకట్ట పడేలా పరిష్కారం కొనుగొనాలని కేంద్రానికి సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది.




    ఎన్నికల సమయంలో అహేతుకమైన ఉచితాల వాగ్దానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో న్యాయవాది, బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్‌ పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పార్టీల ఎన్నికల గుర్తును స్వాధీనం చేసుకోవాలని, లేదంటే ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జనవరి 25న సీజేఐ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీలపై నిషేధం విధించే చట్టాన్ని ప్రభుత్వమే తీసుకురావాల్సి ఉంటుందని ఈసీ తరఫున హాజరైన న్యాయవాది కోర్టుకు నివేదించారు.



    ఎన్నికల్లో ఉచిత వాగ్ధానాలు చాలా సీరియస్ అంశమని.. దీనిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం ఎందుకు ఆలోచిస్తోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై పరిష్కారం కోసం ఫైనాన్స్ ఫైనాన్స్ కమిషన్ సూచనలను కోరవచ్చో లేదో పరిశీలించాలని సూచించింది. ఇలాంటి ఉచిత హామీలపై ప్రభుత్వాలు దృష్టి సారించకపోతే.. మన ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని పిల్ వేసిన అశ్విని ఉపాధ్యాయ్‌ వాపోయారు. భారత ప్రభుత్వానికి ఆరున్నర లక్షల కోట్ల అప్పులున్నాయని.. ఉచిత హామీలను నియంత్రించకపోతే.. భారత్ కూడా శ్రీలంకలా మారే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ఐతే ఇందులో ఎన్నో రాజకీయ అంశాలు ఇమిడి ఉన్నాయని..అందువల్ల ఉచిత హామీలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తాను భావించడం లేదని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Election Commission of India, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు