హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Lakhimpur: అక్కడ వందల మంది ఉండగా 23 మందే సాక్ష్యులా..? యూపీ పోలీసుల తీరుపై సీజేఐ అసంతృప్తి

Lakhimpur: అక్కడ వందల మంది ఉండగా 23 మందే సాక్ష్యులా..? యూపీ పోలీసుల తీరుపై సీజేఐ అసంతృప్తి

లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు

లఖింపూర్ ఘటనపై సుప్రీంకోర్టు

లఖీంపూర్​ కేసు విచారణ మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV​ రమణ (NV Ramana) నేతృత్వంలోని ధర్మాసం చేపట్టింది. అయితే పోలీసులు విచారణ సరళిపై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.

  ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ​లోని లఖింపూర్ ఖేరీ (Lakhimpur kheri) కారు ప్రమాద ఘటనపై సుప్రీం కోర్టు (supreme court) విచారణ జరిపింది. ఆ ప్రమాదంలో నలుగురు రైతులు (farmers), మరికొంతమంది బీజేపీ కార్యకర్తలు, ఓ జర్నలిస్టు (journalist) చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును సీరియస్​గా తీసుకున్న సుప్రీంకోర్టు త్వరితగతిన విచారణ చేపట్టింది. సుప్రీం ఆగ్రహంతోనే కేంద్రమంత్రి కుమారుడు ఆశీష్​ మిశ్రా (ashis Mishra)ని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ కేసు విచారణ మంగళవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV​ రమణ (NV Ramana) నేతృత్వంలోని ధర్మాసం చేపట్టింది. అయితే పోలీసులు విచారణ సరళిపై ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.  వందల సంఖ్యలో రైతుల ర్యాలీలో నడుస్తుండగా, ప్రత్యక్ష సాక్షులు (Eyewitnesses) కేవలం 23 మంది మాత్రమేనా? అంటూ సీజేఐ ఎన్వీ రమణ ప్రశ్నించారు. మరింత మంది సాక్షులను సేకరించి వారికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు యూపీ (UP) ని ఆదేశించింది. స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయడంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా, న్యాయ అధికారులు అందుబాటులో లేకుంటే సమీపంలోని జిల్లా జడ్జిని సంప్రదించాలని సుప్రీం పేర్కొంది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు.

  వందల మంది ఉన్నారు కదా...

  విచారణ సందర్భంగా 68 మందిలో 30 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినట్టు యూపీ సర్కారు (UP govt) కోర్టుకు తెలిపింది. ఇందులో 23 మంది ప్రత్యక్ష సాక్షులున్నారని (Eyewitnesses) వెల్లడించింది. అక్కడ వందల మంది రైతులు ఉంటే కేవలం 23 మందే ప్రత్యక్షసాక్షులు ఉన్నారని ఎలా చెబుతారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఆధారాల రూపంలో మీడియా దృశ్యాలు (media visuals) అనేకం ఉన్నాయని.. వాటిని ధృవీకరించాల్సి ఉందని యూపీ సర్కారు పేర్కొంది. కారును చూసినవారు, కార్లో ఉన్న వ్యక్తులను చూసినవారు ఉన్నారని చెప్పింది. నిందితులుగా ఉన్న 16 మందిని గుర్తించామని కోర్టుకు తెలిపింది.

  ఏ కేసులోనైనా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం (Testimony) కీలకమని, విశ్వసనీయమని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. సాక్షుల భద్రతపై ఆరా తీశారు. ప్రభుత్వ దర్యాప్తులో పురోగతిపై సంతృప్తి వ్యక్తి చేసిన ధర్మాసనం (bench) సాక్షులకు భద్రత కల్పించాల్సిందేనని యూపీ సర్కార్ స్పష్టం చేసింది.

  నవంబర్​కి వాయిదా..

  ఎనిమిది మంది హత్యకు సంబంధించి ఎంత మందిని అరెస్టు చేశారో, ఏ ఆరోపణలపై అరెస్టు చేశారో స్టేటస్ రిపోర్టులో జాబితా అందజేయాలని చేయాలని ఆదేశించింది. అలాగే ఈ ఘటనన జర్నలిస్ట్ రమణ్ కశ్యప్ సహా చనిపోయిన నలుగురి వ్యవహారంపై నమోదైన మరో ఎఫ్ఐఆర్ (FIR)‎ నివేదికను కోరింది. ఇక తదుపరి విచారణను నవంబర్ 8కి ధర్మాసనం వాయిదా వేసింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Accident, Farmers, Farmers Protest, Supreme Court, Uttar pradesh

  ఉత్తమ కథలు