Home /News /national /

SUPREME COURT ALLOWS CENTRE TO CONTINUE WITH SECURITY COVER FOR AMBANIS SK

Supreme Court: అంబానీ ఫ్యామిలీకి సెక్యూరిటీని కొనసాగించవచ్చు.. కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతి

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Mukesh Ambani Family Security: రిలయన్స్ ప్రమోటర్లకు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కెేటగిరి భద్రతను కల్పించాడన్ని సవాల్ చేస్తూ.. త్రిపుర హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. తమ కుటుంబ సభ్యులకు సెక్యూరిటీకి అయ్యే ఖర్చులను కేంద్రం భరించడం లేదని.. అంబానీయే భరిస్తున్నారని స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
    ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఫ్యామిలీ భద్రత విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీచేసింది. అంబానీ కుటుంబ సభ్యులకు సెక్యూరిటీని కొనసాగించేందుకు కేంద్రానికి అనుమతి ఇచ్చింది. ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులకు యథావిధిగా భద్రత కల్పించవచ్చని స్పష్టం చేసింది. రిలయన్స్ (Reliance) ప్రమోటర్లకు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించాడన్ని సవాల్ చేస్తూ.. త్రిపుర హైకోర్టు (Tripura High Court)లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వారి కుటుంబ సభ్యులకు సెక్యూరిటీకి కేంద్ర ఎలాంటి ఖర్చు చేయడం లేదని..  అంబానీయే భరిస్తున్నారని స్పష్టం చేసింది. వారికి ఎప్పటిలానే జెడ్ ప్లస్ కేటగిరి (Z+ Security) భద్రత కల్పించవచ్చని.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ  (NV Ramana) నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేంద్రానికి అనుమతి ఇచ్చింది. అంతేకాదు దీనిపై విచారించాల్సిన అవసరం లేదని త్రిపుర హైకోర్టును ఆదేశించింది.

    Narendra Modi: కేంద్రం కొత్త పథకం.. ప్రారంభించనున్న మోదీ.. ఈ పథకంతో లాభాలు ఏంటంటే..!

    ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులకు కేంద్రం కల్పిస్తున్న భద్రతను సవాల్ చేస్తూ బికేశ్ సాహా అనే వ్యక్తి గతంలో త్రిపుర హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలసిందే. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మే 31, జూన్ 21న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ముకేశ్ అంబానీతో పాటు ఆయన సతీమణి, పిల్లలకు పొంచి ఉన్న ముప్పు, అంచనా నివేదికపై కేంద్రహోశాఖ వద్ద పత్రాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. త్రిపుర హైకోర్టు ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ హిమా కొహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం దానిపై విచారించి.. త్రిపుర హైకోర్టు ఆదేశాలపై జూన్ 29న స్టే విధించింది.



    కేసు విచారణ సందర్భంగా.. పిటిషనర్ తరపున వాదించిన వికాస్ సాహకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఈ పిల్ వేయడం వెనక ఉద్దేశ్యమేంటని ప్రశ్నించింది. భద్రత గురించి మీరెందుకు ఆందోన చెందుతున్నారు? ఇది ఇతరుల భద్రతకు సంబంధించిన విషయం. దానికి వారే ఖర్చులు భరిస్తుంటే..మీకేంటి ఇబ్బంది గట్టిగానే ప్రశ్నించింది. ముంబైలో ఉంటున్న వారికి భద్రత ఇచ్చే విషయంలో త్రిపురకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇది విచారించదగ్గ పిటిషన్ కాదని.. దానిపై విచారించాల్సిన అవసరం లేదని త్రిపుర హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులకు భద్రతను కొనసాగించేందుకు కేంద్రానికి అనుమతి ఇచ్చింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Mukesh Ambani, Reliance, Reliance Industries, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు