హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vaccine From Sky: డ్రోన్ల సహాయంతో వ్యాక్సిన్ల సరఫరా.. మొదట ఆ జిల్లా నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలివే..

Vaccine From Sky: డ్రోన్ల సహాయంతో వ్యాక్సిన్ల సరఫరా.. మొదట ఆ జిల్లా నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vaccine With Drones: ఆకాశ మార్గాన ప్రజలకు ఔషధాలు, టీకాలను చేరవేసే విధానం నేటి నుంచి ప్రయోగాత్మకంగా మొదలుకానుంది. డ్రోన్లను వినియోగించి టీకాలు, ఔషధాలను ప్రయోగాత్మకంగా పంపించే కార్యక్రమాన్ని వికారాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

కరోనా(Corona) కాలంలో మహమ్మారిని అంతమొందించటానికి పలు చర్యలు తీసుకున్న తెలంగాణ(Telangana) సరికొత్త రికార్డు క్రియేట్ చేయటానికి రెడీ అయ్యింది. అదే కరోనా వ్యాక్సిన్‌ (Corona Vaccine) డెలివరీ చేయటానికి టెక్నాలజీని ఉపయోగించనుంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నగరాల్లో బాగానే జరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంతగా లేదు. దీంతో మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యాక్సినేషన్‌ వేగంగా చేయటానికి డ్రోన్లతో వ్యాక్సిన్లను(Vaccine) తరలించేందుకు రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా అమలుచేయనున్న ఈ కార్యక్రమం.. తెలంగాణ నుంచే షురు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు ఈ నెల 11న ప్రారంభం కానుంది. మంత్రి కేటీఆర్(KTR).. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య(Jyothiradhitya Sindhiya) సింధియాతో కలిసి ఈ డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

తొలుత జిల్లా కేంద్రాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు చేరవయనున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. మొదటి రోజు జిల్లా పరిధిలో ఉన్న 5 పీహెచ్‌సీలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు చేరవేస్తారు. వికారాబాద్‌ మండల పరిధిలోని సిద్దులూరు, వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రామయ్యగూడ, ధారూర్‌ మండల పరిధిలోని నాగసముందర్, బంట్వారం, బొంరాస్‌పేట పీహెచ్‌సీలకు మందులను సరఫరా చేస్తారు. బ్లూడార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, డ్రోన్‌ డెలివరీ స్టార్టప్‌ స్కై ఎయిర్‌, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి.

Income Source: ప్రతీ నెల రూ.200 పొదుపుతో.. రూ.28 లక్షల వరకు పొందొచ్చు.. వివరాలిలా..

‘మెడిసిన్‌ ఫ్రమ్‌ ది స్కై’పేరుతో మొదటి డ్రోన్‌ ఫ్లైట్‌ ను ప్రారంభించనున్నారు. దేశంలో డ్రోన్ల ద్వారా ఔషధాలు, టీకాలను పంపిణీ చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా డ్రోన్లు బేస్‌ నుంచి 500-700 మీటర్ల మధ్య ఎత్తులో ఎగురుతాయి. ప్రాజెక్ట్‌ మొదలైన మొదటి రెండు రోజులు కంటికి కనిపించే ఎత్తులో డ్రోన్లను వినియోగిస్తారు. సెప్టెంబరు 11 నుంచి డ్రోన్‌ విమానాలు 9-10 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. అధికారులు మెడిసన్ ఫ్రం స్కై కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. విమానయాన శాఖ, పోలీసు శాఖల అనుమతులతో పాటు పీహెచ్‌సీలకు సరఫరా చేయాల్సిన టీకా బాక్సులు, నిల్వ వంటి పలు అంశాలను పర్యవేక్షిస్తున్నారు.

Smart Air-purifier: భారతీయుల ప్రతిభ.. మొక్కతో ఎయిర్‌ ప్యూరిఫయర్‌ తయారీ.. ఎలా పని చేస్తుందంటే? 

డ్రోన్లు(Drones) ఆకాశంలో ఎగరడం, గమ్యస్థానాలకు చేరే వరకు మానిటర్ చేయడం, వాటి రక్షణ వంటి వాటిని పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది. అధికారులు మెడిసన్ ఫ్రం స్కై కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. విమానయాన శాఖ, పోలీసు శాఖల అనుమతులతో పాటు పీహెచ్‌సీలకు సరఫరా చేయాల్సిన టీకా బాక్సులు, నిల్వ వంటి పలు అంశాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్లు ఆకాశంలో ఎగరడం, గమ్యస్థానాలకు చేరే వరకు మానిటర్ చేయడం, వాటి రక్షణ వంటి వాటిని పోలీసు శాఖ పర్యవేక్షిస్తుంది.

First published:

Tags: Corona Vaccine, Drones

ఉత్తమ కథలు