హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Twin Towers Demolition: త్వరలో నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే..

Twin Towers Demolition: త్వరలో నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత.. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే..

Supertech Twin Tower

Supertech Twin Tower

Twin Towers Demolition: రెండు టవర్లలో చిన్నదైన సెయాన్నే (Ceyanne)లో పూర్తిగా పేలుడు పదార్థాలు ఫిక్స్ చేసేసింది. 103 మీటర్ల ఎత్తైన ఈ అపెక్స్, సెయాన్నే టవర్లు కూల్చివేసేందుకు సెప్టెంబరు 4 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని నొయిడా(Noida)లో ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్ (Emerald Court Project) వద్ద అక్రమంగా నిర్మించిన సూపర్‌టెక్ 40-అంతస్తుల ట్విన్ టవర్స్‌(Twin Towers)ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌(NCR)లోని ఈ టవర్లను కూల్చి వేసే బాధ్యతను ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. కాగా కూల్చివేత ప్రక్రియకు డెడ్‌లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ ప్రణాళికలను వేగంగా అమలు చేస్తోంది. ఇప్పటికే రెండు టవర్లలో చిన్నదైన సెయాన్నే (Ceyanne)లో పూర్తిగా పేలుడు పదార్థాలు ఫిక్స్ చేసేసింది. 103 మీటర్ల ఎత్తైన ఈ అపెక్స్, సెయాన్నే టవర్లు కూల్చివేసేందుకు సెప్టెంబరు 4 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఇంతకుముందు ఉన్న ఆగస్టు 28 గడువును ఏడు రోజులకు పొడిగించింది. అయితే, గత గడువుకు అనుగుణంగా ఆగస్టు 13 నుంచే పేలుడు పదార్థాలు అమర్చడం ప్రారంభించింది సంస్థ.


టవర్స్ వద్ద పేలుడు పదార్థాలను ఛార్జింగ్/అమర్చే ప్రక్రియను పూర్తి చేయడానికి ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థకు 15 రోజుల సమయం పడుతుందని ఒక నివేదిక తెలిపింది. పేలుడు పదార్ధాల 'ఛార్జింగ్' ప్రక్రియ అంటే టవర్ల కాంక్రీటులోకి డ్రిల్ చేసిన 9,000 రంధ్రాలలో 3,700 కిలోల పేలుడు పదార్థాలను ప్యాక్ చేసే ప్రక్రియ.


కాగా, ఈ కూల్చివేత బృందంలో కనీసం 100 మంది కార్మికులు ఉంటారని సమాచారం. ప్రస్తుతానికి సెయాన్నే వద్ద పని పూర్తయినందున, కూల్చివేత బృందం పెద్ద టవర్ అయిన అపెక్స్ వద్ద పనిని ప్రారంభిస్తుంది. ఇది 22వ, 24వ అంతస్తులలో ప్రారంభమవుతుంది. మొత్తం పేలుడు ఫిక్సింగ్ ప్రక్రియ ఆగస్టు 26 నాటికి పూర్తయ్యే అవకాశముంది. ఆ తర్వాత షాక్ ట్యూబ్‌లను చెక్ చేసి కనెక్ట్ చేస్తారు.


ఇది కూడా చదవండి : ఇస్రో కొత్త SSLV ప్రత్యేకత ఏంటి? ఇది ఎందుకు కీలకమో తెలుసుకోండి..


అపెక్స్ టవర్ పొడవుగా ఉంది కాబట్టి పేలుడు పదార్థాల ఛార్జింగ్ ప్రక్రియకు ఎక్కువగా సమయం పడుతుందని ఎడిఫైస్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్ మయూర్ మెహతా అన్నారు. కింది అంతస్తులకు వెళ్లే కొద్దీ భారీ ఛార్జింగ్, మరిన్ని పేలుడు పదార్థాలు అవసరమవుతాయని పేర్కొన్నారు. బేస్‌మెంట్ 1, గ్రౌండ్ ఫ్లోర్‌లు చాలా వరకు పేలుడు పదార్థాలను అమర్చిన ప్రైమరీ బ్లాస్ట్ ఫ్లోర్‌లుగా పనిచేస్తాయని, ప్రతి ప్రత్యామ్నాయ అంతస్తు ప్రైమరీ లేదా సెకండరీ బ్లాస్ట్ ఫ్లోర్‌గా పనిచేస్తుందని వివరించారు. అపెక్స్‌లో 32, సెయాన్నేలో 29 అంతస్తులు ఉన్నాయి.


* ట్రాఫిక్‌కు ఇబ్బందులు

ఈ కూల్చివేత సమీప ప్రాంతాలలో ట్రాఫిక్‌పై ప్రభావం చూపుతుంది. అందువల్ల కూల్చివేసే రోజున ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు పక్కా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. నొయిడా-గ్రేటర్ నొయిడా ఎక్స్‌ప్రెస్ వే మూసివేసి.. ఆ సమీప మార్గాల్లో వెళ్లబోయే వాహనదారులను అరగంట పాటు వేరే వైపు మళ్లిస్తారు.


అలానే సమీపంలోని ఫ్లైఓవర్ పూర్తిగా మూసివేసే అవకాశం కూడా ఉంది. పేలుడు జరగడానికి కొన్ని సెకన్ల సమయం మాత్రమే పడుతుందని.. కొన్ని నిమిషాల్లో దుమ్ము క్లియర్ అవుతుందని కూల్చివేత సంస్థ తెలియజేసిందని.. అయినా కూడా కొంత ఎక్కువ సమయం పాటు ట్రాఫిక్ ఆపుతామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) గణేష్ ప్రసాద్ సాహా అన్నారు. పేలుడుకు రెండు రోజుల ముందు ఫైనల్ ట్రాఫిక్ ప్లాన్ షేర్ చేస్తామన్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Business, National News, Noida, Uttar pradesh

ఉత్తమ కథలు