Home /News /national /

SUPER KID FROM INDORE WHO SOLVES RUBIKS CUBE BLIND FOLDED MEET 13 YEAR OLD TANISHKA SUJIT AK GH

Super kid: కళ్లకు గంతలు కట్టుకుని ఇలా చేయగలరా... సోషల్ మీడియాలో వైరల్‌గా బాలమేధావి

(Image: Twitter)

(Image: Twitter)

మన కళ్లెదుటే మ్యాజిక్ చేస్తున్న తనిష్కాను ఇప్పుడు నెటిజన్లు ఒకటే ప్రశంసిస్తున్నారు. రూబిక్ పజిల్ మాత్రమే కాదు కళ్లకు గంతలు కట్టుకుని కూడా రాయటం ఈమెకు కొట్టినపిండి.

సూపర్ కిడ్ అంటూ ఓ 13 ఏళ్ల అమ్మాయి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. దీనికంతా కారణం ఆమె ఎక్స్ట్రార్డినరీ స్కిల్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే రూబిక్ క్యూబ్ ను సెట్ చేసేందుకు కొందరు క్షణాల టైం తీసుకుంటే కొందరు ఎన్ని రోజులు కష్టపడ్డా ఈపనిని పూర్తిచేయలేరు. తనిష్కా సుజిత్ అనే ఈ చిన్నారి మాత్రం కళ్లకు గంతలు కట్టుకుని కూడా రూబిక్ క్యూబ్ ను చకచకా సర్దేయగలదు. కంటిపైన లావుగా, నల్లని వస్త్రాన్ని కట్టుకుని చేతి వేళ్లను ఈమె ఇలా అలా తిప్పితే సరి రూబిక్ క్యూబ్ సెట్ అయిపోతుంది. మన కళ్లెదుటే మ్యాజిక్ చేస్తున్న తనిష్కాను ఇప్పుడు నెటిజన్లు ఒకటే ప్రశంసిస్తున్నారు. రూబిక్ పజిల్ మాత్రమే కాదు కళ్లకు గంతలు కట్టుకుని కూడా రాయటం ఈమెకు కొట్టినపిండి.

ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్..
ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తనిష్కా చోటు సంపాదించుకుంది. తనకు 11 ఏళ్ల వయసున్నప్పుడే 10వ తరగతి పరీక్షలు, 12 ఏళ్ల వయసులో 12 వ తరగతి పాస్ అయినట్టు తనిష్కా చెబుతోంది. ఇక తనిష్క రూబిక్ పజిల్ ఇప్పటికే 44వేల వ్యూస్ రాబట్టింది. ఈమె సూపర్ స్కిల్స్ కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. "ఇండియాలో ఇలాంటి టాలెంట్స్ కు కొరతే లేదని" ఒకరు ట్వీట్ చేస్తే మరొకరు.. "ఈ వీడియోను తన తల్లిదండ్రులు చూస్తే తప్పకుండా తనకు చీవాట్లు పడతాయ"ని మరో నెటిజన్ ట్వీట్ చేయటం కూడా ఆకట్టుకుంటోంది.

IPS ఆఫీసర్ కావటమే లక్ష్యం
ప్రస్తుతం ఇండోర్ లోని దేవి అహిల్యా విశ్వవిద్యాలయం లో గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఈమె ఇండియన్ పోలీస్ సర్వీసులో చేరాలనే లక్ష్యంతో ఉంది. ఐపీఎస్ ఆఫీసర్ గా దేశ సేవ చేయాలని తనిష్క ఉవ్విళ్లూరుతోంది. కథక్ డ్యాన్సర్ కూడా అయిన ఈ బాల మేధావి డ్యాన్స్ లో పీహెచ్డీ చేయాలని ఆశపడుతోంది. నర్సరీ కోసం తమ పాపను స్కూలు చేర్చలేదని.. ఏకంగా మూడవ తరగతికి ఓ ప్రైవేటు స్కూల్లో అడ్మిషన్ చేయించినట్టు తనిష్క తల్లి వివరిస్తున్నారు. తనిష్క తండ్రి బాలమేధావిలా ఆమెను తీర్చిదిద్దగా, ఇటీవలే కోవిడ్-19 బారిన పడిన ఆయన మరణించారు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Indore

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు