Home /News /national /

అత్యంత తీవ్ర తుఫానుగా ఉమ్ పున్..!

అత్యంత తీవ్ర తుఫానుగా ఉమ్ పున్..!

తీరం దాటిన అంఫన్

తీరం దాటిన అంఫన్

Cyclone Amphan : పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉమ్ పున్ పెను తుఫాను కొనసాగుతోందని, వచ్చే 6 గంటల్లో అది అత్యంత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    Cyclone Amphan : పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉమ్ పున్ పెను తుఫాను కొనసాగుతోందని, వచ్చే 6 గంటల్లో అది అత్యంత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి రేపు(మే 20) మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పశ్చిమ బెంగాల్‌-బంగ్లాదేశ్‌ తీరంలోని హతియా దీవుల వద్ద తీరం దాటే సూచనలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో అత్యంత తీవ్ర తుఫానుగా మారే సూచనలు ఉన్నాయని, గంటకు 165 నుంచి 195 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు వీచనున్నాయి. ఏపీలోని అన్ని పోర్టుల్లో రెండో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి చెదురుమదురు జల్లులు పడనున్నాయి.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Bay of Bengal, Cyclone amphan, WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు