SUNNY LEONE SONG MINISTER ANGRY OVER SUNNY LEONE DEMAND AN APOLOGY EVK
Sunny Leone Song: సన్నిలియోన్‌పై మంత్రి ఆగ్రహం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
సన్నీ లియోన్ (ఫైల్)
Sunny Leone Song: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఇటీవల సన్నీ లియోన్ నటించిన ఒక మ్యూజిక్ వీడియోపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఆ పాటను తీసివేయకుంటే, ఆ పాట నటి మరియు మేకర్స్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ఇటీవల సన్నీ లియోన్ (Sunny Leone) నటించిన ఒక మ్యూజిక్ వీడియోపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఆ పాటను తీసివేయకుంటే, ఆ పాట నటి మరియు మేకర్స్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లియోన్ క్షమాపణలు చెప్పాలని మిశ్రా కోరుతూ, మూడు రోజుల్లోగా యూట్యూబ్ (YouTube) నుంచి వీడియోను తొలగించకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమెపై ఇంకా మ్యూజికట్ డైరక్టర్ సాకిబ్ తోషిపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. లియోన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని కూడా చెప్పారు. కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడిన మధుబన్ మే రాధిక నాచే నంబర్ కోసం సారెగమా మ్యూజిక్ బుధవారం మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఈ పాట కొంతమంది చూపించిన నృత్య కదలికల కారణంగా మనోభావాలను దెబ్బతీశారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పాటను నిజానికి 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు.
ఈ వీడియోపై నిషేధం విధించాలని మధుర వాసులు డిమాండ్ చేశారు. బాలీవుడ్ నటి ఐకానిక్ పాటలో ఇటువంటి నృత్యం చేయడం ద్వారా తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని వారు ఆరోపించింది.
BJP: బీజేపీ కొత్త తలనొప్పులు.. రాజీనామా చేస్తానని బెదిరిస్తున్న మంత్రి!
कुछ विधर्मी लगातार हिंदू भावनाओं को आहत कर रहे हैं। ‘मधुबन में राधिका नाचे’ ऐसा ही कुत्सित प्रयास है। मैं सनी लियोनी जी व शारिब तोशी जी को हिदायत दे रहा हूं कि समझें और संभलें। अगर तीन दिन में दोनों ने माफी माँगकर गाना नहीं हटाया तो हम उनके खिलाफ एक्शन लेंगे। pic.twitter.com/9DbgQV4cuy
ప్రభుత్వం నటికి వ్యతిరేకంగా చర్య తీసుకోకపోతే, ఆమె వీడియో ఆల్బమ్‌ను నిషేధించకపోతే మేము కోర్టుకు వెళ్తాం అని బృందాబన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ అన్నారు. ఆమె సీన్‌ను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పించాలని అన్నారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ “కొందరు నిరంతరం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీస్తున్నారు. నేను న్యాయ సలహా తీసుకుంటాను మరియు మూడు రోజుల్లో వీడియోను తీసివేయకపోతే తోషి, లియోన్ చర్యలు తీసుకుంటాను" అని ఆయన అన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.