ఐటమ్ లేడీ సన్నీలియోన్ పాటపై రాద్ధాంతం ఇంకా కొనసాగుతూనే ఉంది. పాటను మూడ్రోజుల్లోగా తొలగించకపోతే సహించేది లేదని హిందూ సంఘాలు, మధ్యప్రదేశ్ మినిస్టర్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో సారేగమ మ్యూజిక్ సంస్థ దిగొచ్చి తప్పును సరిదిద్దుకుంటామని వివరణ ఇచ్చింది. గడువులోగా పాటును తొలగించకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని హిందూ సంఘాలు హెచ్చరించాయి.
బాలీవుడ్ ఐటమ్ లేడీ సన్నీ లియోన్ లేటెస్ట్ ఆల్బమ్‌పై రచ్చ రచ్చవుతోంది. మధుబన్ మే రాధికా నాచే పేరుతో ఉన్న పాటలో సాహిత్యం పూర్తిగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ పాటలో రాధాకృష్ణుల ప్రేమకథను తప్పుగా చూపించారంటూ మధ్యప్రదేశ్‌లో హిందూ సంఘాలు తీవ్రంగా తప్పుుపట్టాయి. సాంగ్‌లో శృంగారతార సన్నీలియోన్ వేసిన స్టెప్పులు, చేసిన ఎక్స్పోజింగ్పైన కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాధ డ్యాన్సర్ కాదని , మధుబన్ ఓ పవిత్ర ప్రదేశమని..రాధా మధుబన్‌లో అర, కొర దుస్తులు వేసుకొని డ్యాన్సులు చేయలేదంటూ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్బమ్ రూపొందించిన సంస్థపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి హిందూ సంఘాలు.
మూడ్రోజుల్లో పాట తొలగించాలని వార్నింగ్..
అభ్యంతరకరంగా ఉన్న సన్నీలియోన్ అల్బమ్‌ని వెంటనే తొలగించాలని..పాటను నిషేధించాలంటూ మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సదరు మ్యూజిక్ సంస్థను ఆదేశించారు. అంతే కాదు..పాటను రూపొందించిన సారేగమ మ్యూజిక్ సంస్థకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. 72గంటల్లో సాంగ్‌ని తొలగించాలని డెడ్ లైన్ విధించారు. మినిస్టర్ హెచ్చరికతో మ్యూజిక్ సంస్థ సారేగమ దిగొచ్చింది. వివాదాస్పదమైన సాంగ్‌లోని లిరిక్స్ మార్చుతామని ప్రకటించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలన్న ఆలోచన తమది కాదని..జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటామని పేర్కొంది.
శృంగారతార సాంగ్‌పై భగ్గుమంటున్న హిందూ సంఘాలు..
సన్నీలియోన్ యాక్ట్ చేసిన మధుబన్ మే రాధికా నాచే అల్బమ్ ఈనెల 22న విడుదల చేసింది సారేగమ మ్యూజిక్ సంస్థ. ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ పూజారి ఈపాటపై ముందుగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో రచ్చ మొదలైంది. మధ్యప్రదేశ్ హోంమంత్రి ఇచ్చిన డెడ్‌లైన్‌లోగా ఈ పాటను తొలగించకపోతే ..తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హిందూ సంఘాలు హెచ్చరించాయి. ఈ పాటను సింగర్స్ కనికా కపూర్, అరిందమ్ చక్రవర్తి పాడారు. వాస్తవానికి అరవై ఏళ్ల క్రితం కోహినూర్ సినిమా కోసం అప్పటి పాపులర్ సింగర్ మహమ్మద్ రఫీ ఈ పాటను పాడారు.
పాటలపై వివాదం ఇప్పుడు కొత్తేమి కాదు. సినిమాల్లో చాలా పాటలపై అభ్యంతరాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సన్నీలియోన్ అల్బమ్ విషయంలో మాత్రం రాధా,కృష్ణుల పేరుతో హిందువుల సెంటిమెంట్‌ని దెబ్బతీసేలా రూపొందించడంతోనే దుమారం చెలరేగింది. పాటలోని సాహిత్యం, వీడియో సాంగ్‌లో రాధ డ్యాన్సులు చేయడం వంటి వాటినే హిందూ సంఘాలు, శ్రీకృష్ణుడి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.